Sarfaraz khan: కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz khan: కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న సర్ఫరాజ్ ఖాన్"
Play all audios:
భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్‌కు మధ్య పోటాపోటీగా జరుగుతున్న అనధికార తొలి టెస్ట్ మ్యాచ్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్‌కు
మధ్య తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. కరుణ్‌నాయర్ (Karun Nair) 204 పరుగుల విన్యాసంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఎ.. స్కోర్ బోర్డుపై 557 పరుగుల్ని నమోదు చేయగలిగింది.
ఛేదనలో మూడోరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ లయన్స్ ఏడు వికెట్లు నష్టపోయి 527 రన్స్ చేసింది. ఆతిథ్య జట్టు ఇంకా 30 పరుగులు వెనకంజలోనే ఉంది. టామ్ హైన్స్ 171 రన్స్ చేయడంతో ఇంగ్లండ్ లయన్స్
పుంజుకుంది. అయితే ఇండియా ఎ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) కళ్లు చెదిరే క్యాచ్ అందుకొని హెన్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్యాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. శార్దూల్ ఠాకూర్
(Shardul Thakur) వేసిన ఫుల్లర్ డెలివరీని ఆఫ్ సైడ్ డ్రైవ్ ఆడటానికి హైన్స్ ప్రయత్నించాడు. బంతి బ్యాట్ అంచును తాకి మొదటి స్లిప్ వైపునకు దూసుకెళ్లింది. మెరుపువేగంతో సర్ఫరాజ్ ఖాన్ తన
ఎడమవైపునకు దూకి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. తన బరువు, ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలకు అతడు ఈ స్టన్నింగ్ క్యాచ్ ద్వారా సమాధానం చెప్పినట్లైంది. ఇంగ్లండ్‌తో జరగనున్న అయిదు టెస్ట్
మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు సర్ఫరాజ్ కఠినమైన డైట్ ప్లాన్ ద్వారా 10 కిలోలు తగ్గినట్లు సమాచారం. తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి అతడు ఉడికించిన కూరగాయలు, చికెన్‌తో కూడిన ఆహారం
తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు.. దురదృష్టవశాత్తూ సర్ఫరాజ్ ఖాన్ టీమ్‌ఇండియాలో(Team India) స్థానం సంపాదించలేకపోయాడు.
Trending News
Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులుఇంటర్నెట్ డెస్క్: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...
Aita under-16 tennis: pranav, amodini emerge championsBengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
Stock market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..Stock Market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్...
Tesla: భారత్‌లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామిTesla | ఇంటర్నెట్‌డెస్క్: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ...
Latests News
Sarfaraz khan: కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న సర్ఫరాజ్ ఖాన్భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్‌కు మధ్య పోటాపోటీగా జరుగుతున్న అనధికార తొలి టెస్ట్ మ్యాచ్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌న...
Supreme court: ‘మా అమ్మ ఎక్కడుంది? ’.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఓ యువకుడు తన తల్లి కోసం సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు ...
Chhatrapati sambhajinagar: lord ram, goddess sita's padukas welcomed amid grand celebrations at kranti chowk - photos insideChhatrapati Sambhajinagar: Lord Ram, Goddess Sita's Padukas Welcomed Amid Grand Celebrations At Kranti Chowk - PHOT...
India-pakistan: సరిహద్దులో ఉద్రిక్తతలు.. నేడు భారత్, పాక్‌ల మధ్య కీలక భేటీ..ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు ప...
ఈనాడు జర్నలిజం స్కూలు ప్రాథమిక పరీక్ష కీ విడుదలఈనాడు జర్నలిజం స్కూలు ప్రవేశ పరీక్ష పేపర్-1 సమాధానాలు విడుదలయ్యాయి. పేపర్ 1 సమాధానాలివీ! By Features Desk Published : ...