Pak isi: నేపాల్ గూఢచారి.. రాంచీ స్లీపర్‌సెల్: పహల్గాం కంటే ముందు దిల్లీలో పాక్ ‘ఐఎస్‌ఐ’ కుట్రలు
Pak isi: నేపాల్ గూఢచారి.. రాంచీ స్లీపర్‌సెల్: పహల్గాం కంటే ముందు దిల్లీలో పాక్ ‘ఐఎస్‌ఐ’ కుట్రలు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్ భారత్ ఉలిక్కిపడింది. ఈ ఘటనకు పాకిస్థాన్ ఉగ్ర ముఠాలతో సంబంధమున్నట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే, పహల్గాం ఘటన కంటే కొన్ని వారాల ముందే దిల్లీలో ఓ భారీ ఉగ్రదాడి (Terror Plot in Delhi)కి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (Pakistan ISI) కుట్ర పన్నినట్లు తాజాగా బయటికొచ్చింది. నేపాల్ గూఢచారి
(Nepal Spy)తో ఐఎస్‌ఐ పన్నిన ఈ కుట్రను మన నిఘా సంస్థలు సీక్రెట్ ఆపరేషన్‌తో భగ్నం చేశాయి. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్ మీదుగా దిల్లీకి
పంపి.. భారత సాయుధ దళాలకు సంబంధించిన రహస్యమైన పత్రాలు, కీలక ప్రదేశాల ఫొటోలను సేకరించడం కోసం పాక్ ఐఎస్‌ఐ తమ గూఢచారిని నేపాల్ మీదుగా దిల్లీకి పంపించినట్లు ఈ ఏడాది జనవరిలో ఇంటెలిజెన్స్
ఏజెన్సీలకు సమాచారం వచ్చింది. అదే సమయంలో దిల్లీ పోలీసులకు కూడా ఓ పాకిస్థానీ ఏజెంట్ గురించి సమాచారం అందింది. దీంతో కేంద్ర సంస్థలతో కలిసి దిల్లీ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించారు.
అయితే, అప్పటికే నేపాల్ జాతీయుడైన ఆ గూఢచారి అన్సారుల్ మియాన్ అన్సారీ దిల్లీకి చేరుకొని, కొన్ని మిలిటరీ డాక్యుమెంట్లను సంపాదించాడు. * జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం లేదు: పోలీసులు
ఈక్రమంలోనే ఫిబ్రవరి 15న దిల్లీలోని హోటల్ నుంచి అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ మీదుగా పాకిస్థాన్‌కు తిరిగివెళ్లేందుకు అన్సారీ
ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కాడు. ఇక, అన్సారీకి సాయం చేసిన రాంచీకి చెందిన అజామ్ అనే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. వీరిద్దరూ పాక్‌లోని ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు
గుర్తించారు. అనంతరం వీరిద్దరి తిహాడ్ జైలుకు తరలించి విచారించారు. ఈ విచారణలో ఐఎస్‌ఐ గూఢచర్యం చేసే నెట్‌వర్క్ గురించి అన్సారీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. నేపాల్‌కు చెందిన ఇతడు
ఖతర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఐఎస్‌ఐకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు అన్సారీని పాకిస్థాన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అతడికి కొన్ని రోజుల పాటు శిక్షణ ఇచ్చి దిల్లీ
పంపించినట్లు విచారణలో తేలింది. అనంతరం అజామ్‌తో కలిసి మిలిటరీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించినట్లు అన్సారీ దర్యాప్తులో అంగీకరించినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు
దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. దిల్లీలో ఐఎస్‌ఐ సెల్‌ను పట్టుకోవడంతో భారీ ఉగ్ర కుట్ర తప్పిందంటూ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending News
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్‌బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenaduఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...
Chidambaram dikshitars call brahmotsavam protest contempt of courtThe complaint added that several cases related to the Brahmotsavam of Sri Govindaraja Perumal Temple, including those fi...
Anant ambani and radhika merchant's wedding: అనంత్, రాధిక పెళ్లి వేళ.. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ నివాళులుధీరూభాయ్ అంబానీ జూలై 6, 2002న కన్నుమూశారు. ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ తరచుగా కుటుంబ ప్రత్యేక సందర్భాలలో తమ ...
Ipl2025: మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌కు తిరిగివచ్చేది అనుమానమేదిల్లీ క్యాపిటల్స్ పేసర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో తిరిగి ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఇంటర...
Latests News
Pak isi: నేపాల్ గూఢచారి.. రాంచీ స్లీపర్‌సెల్: పహల్గాం కంటే ముందు దిల్లీలో పాక్ ‘ఐఎస్‌ఐ’ కుట్రలుఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్ భారత్ ఉలిక్కిపడింది. ఈ ఘటనకు పాకిస్థాన్ ఉ...
Konda surekha: కొండా సురేఖతో గేమ్ ప్లాన్ ఆడిస్తున్నారా? ఇది సీఎం రేవంత్ రెడ్డి వ్యూహమా?Published by: Last Updated:October 03, 2024 5:01 PM IST KONDA SUREKHA: తెలంగాణలో ఇప్పుడో అనవసర వివాదం నడుస్తోంది. అభివృద...
Defence budget: ఆపరేషన్ సిందూర్.. రక్షణ బడ్జెట్ రూ. 50వేల కోట్ల పెంపు..ఇంటర్నెట్‌డెస్క్: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ...
Priyanka chopra boyfriend latest news in hindi, photos, videos on priyanka chopra boyfriend inextlive jagranप्रियंका चोपड़ा ब्वॉयफ्रेंड निक जोनस संग वकेशन मनाने उड़ चलीं गोवा, परिणीति भी दिखीं साथ, देखें तस्वीरें bollywood-masal...
Boney kapoor acquires remake rights of tamil superhit 'comali'Mumbai, Sep 20 (IANS) Producer Boney Kapoor, who remade the Amitabh Bachchan-starrer "Pink" in Tamil, has now ...