Indian railways: ‘మిలిటరీ రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా..? రైల్వేశాఖ అలర్ట్
Indian railways: ‘మిలిటరీ రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా..? రైల్వేశాఖ అలర్ట్"
Play all audios:
భారత ‘సైనిక రైళ్ల’ కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చన్న సమాచారంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) తదనంతర
పరిణామాలతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత ‘సైనిక రైళ్ల’ (Military train) కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు
ప్రయత్నించవచ్చన్న సమాచారంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించి మే 6న ఉద్యోగులకు అడ్వైజరీ జారీ
చేసిన రైల్వే శాఖ.. అటువంటి సమాచారం బహిర్గతం చేయడం జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని తెలిపింది. ‘సైనిక ప్రత్యేక రైళ్ల కదలికలకు సంబంధించి కీలక సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan)
ఇంటెలిజెన్స్ సంస్థలు రాబట్టే అవకాశం ఉంది. రైల్వేలో మిలటరీ విభాగానికి తప్ప.. ఎటువంటి అనధికార వ్యక్తులకు ఆ సమాచారం ఇచ్చినా భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. దానివల్ల దేశ భద్రతకు తీవ్ర ముప్పు
వాటిల్లే అవకాశం ఉంది. సైనిక రైళ్ల కదలికల సమాచారానికి ఉన్న ప్రాధాన్యం, తీవ్రత దృష్ట్యా దీనిపై రైల్వే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’’ అని అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్
ఆపరేషన్ మేనేజర్లకు రైల్వే బోర్డు సందేశం పంపించింది. * ఆపరేషన్ ‘మేఘ్‌దూత్ నుంచి సిందూర్ ’ వరకు! మిల్ రైల్ (Mil Rail) అనేది భారతీయ రైల్వేలో (Indian Railways) ప్రత్యేక విభాగం. సైనిక
వ్యూహాత్మక ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధం వంటి పరిస్థితుల్లో జవాన్లతోపాటు ట్యాంకులు, పరికరాలు, ఇతర వస్తువుల రవాణా వీటి ద్వారానే కొనసాగుతుంది. ఇందుకు
అవసరమైన సంప్రదింపులు రైల్వేబోర్డు ద్వారా కాకుండా ఈ సైనిక విభాగం ద్వారానే జరుగుతాయి. దిల్లీలోని సేనా భవన్లో దీని కార్యాలయం ఉంటుంది.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Latests News
Indian railways: ‘మిలిటరీ రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా..? రైల్వేశాఖ అలర్ట్భారత ‘సైనిక రైళ్ల’ కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చన్న సమాచారంతో రైల్వేశాఖ అప్రమత్...
Andhra pradesh news: ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం.. మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులుమదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోల...
Kiran abbavaram: తండ్రైన కిరణ్ అబ్బవరం.. ఫొటో షేర్ చేసిన నటుడురహస్య, కిరణ్ అబ్బవరం తల్లీదండ్రులయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్: నటుడు కిరణ్ అబ్బవరం (K...
Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్ షెడ్యూలు విడుదలస్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...
Malayalam film industry: డ్రగ్స్ వాడకం కోసం ప్రత్యేక బడ్జెట్: నిర్మాత కీలక వ్యాఖ్యలుమలయాళ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాండ్రా థామస్. మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమల...