Rahul gandhi: అందుకే కులగణనకు ప్రధాని మోదీ అంగీకారం: రాహుల్‌ గాంధీ

Eenadu

Rahul gandhi: అందుకే కులగణనకు ప్రధాని మోదీ అంగీకారం: రాహుల్‌ గాంధీ"

Play all audios:

Loading...

దర్భంగా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ (PM Modi) కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వెనుకబడిన


వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఇక్కడికి


రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ఎంతో ప్రయత్నించారని అన్నారు. అన్ని అడ్డంకుల్నీ అధిగమించి వచ్చానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో


కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే బిహార్‌లో యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన ‘శిక్షా న్యాయ్‌ సంవాద్‌’ కార్యక్రమాన్ని రాహుల్‌ గాంధీ


ప్రారంభించారు. ఈ సందర్భంగా మిథిలా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికారపార్టీ నాయకులు, అధికారులు ఎంతో ప్రయత్నించారు.


యూనివర్సిటీ గేటు బయటే నా కారును నిలిపివేశారు. అయినా, నేను వెనకడుగు వేయలేదు. నడుచుకుంటూ సభా వేదిక మీదికి చేరుకున్నాను. బిహార్‌ ప్రభుత్వం నన్ను ఎందుకు ఆపలేకపోయిందో తెలుసా? మీ అందరి అభిమానమే


నన్ను ముందుకు నడిపించింది. ఇదే శక్తి నరేంద్ర మోదీని గద్దె దించుతుంది. ప్రతిపక్షాల డిమాండ్‌ మేరకే కులగణను మోదీ అంగీకరించారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు’’ అని రాహుల్‌ అన్నారు. ఎన్డీయే


ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కాకుండా...అంబానీ, అదానీల కోసమే పని చేస్తోందని రాహుల్‌ విమర్శించారు. కేవలం 5శాతం మంది ప్రజల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు, ఓబీసీలు,


ఆదివాసీలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదని, కార్పొరేట్‌ వ్యక్తులకే మోదీ గవర్నమెంట్‌ వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కులగణన


చేపట్టాలని, ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మెడలు


వంచైనా వీటిని సాకారం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘ఫులె’ చిత్రాన్ని వీక్షించిన రాహుల్‌ బిహార్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ పట్నాలోని ఓ మల్టీప్లెక్స్‌ థియేటర్‌కు వెళ్లారు.


మహాత్మా జ్యోతిబా ఫులె, సావిత్రిబాయి ఫులెల జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఫులె’ చిత్రాన్ని వీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, సామాజిక వేత్తలు


రాహుల్‌తో కలిసి సినిమా చూశారు.


Trending News

Jagdeep dhankhar: ‘ఆపరేషన్‌ సిందూర్‌.. ’ ఉగ్రమూకలు ఎక్కడున్నా ఏరివేస్తామనే సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖ...

Gt vs lsg: గుజరాత్‌ టైటాన్స్‌కు షాకిచ్చిన లఖ్‌నవూ

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ (IPL) 2025లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ (Lucknow Supergiants).. ...

Cannes film festival: ‘సిందూర్‌’.. మోదీ.. కేన్స్‌లో తారల ‘స్పెషల్‌’ అట్రాక్షన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌:  కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(Cannes Film Festival)లో కేవలం సినిమాలు, రెడ్‌ కార్పెట్‌ గ్లామర్‌తో పాటు ...

Pak isi: నేపాల్‌ గూఢచారి.. రాంచీ స్లీపర్‌సెల్‌: పహల్గాం కంటే ముందు దిల్లీలో పాక్‌ ‘ఐఎస్‌ఐ’ కుట్రలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్ భారత్‌ ఉలిక్కిపడింది. ఈ ఘటనకు పాకిస్థాన్‌ ఉ...

Ola-rapido: అడ్వాన్స్‌ టిప్‌.. ఓలా, ర్యాపిడోపైనా విచారణ

OLA-Rapido: అడ్వాన్స్‌ టిప్‌ వ్యవహారంలో ఓలా, ర్యాపిడోపైనా కేంద్రం విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఉబర్‌కు నోటీసులు జారీ చేసి...

Latests News

Rahul gandhi: అందుకే కులగణనకు ప్రధాని మోదీ అంగీకారం: రాహుల్‌ గాంధీ

దర్భంగా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ (PM Modi) కులగణనకు అంగీకరించారని లోక్‌స...

Kisan car scheme: మీరు రైతులా అయితే బంపర్ స్కీం.. Tata car కొంటే.. 6 నెలలకు ఒకసారి ఈఎంఐ

టాటా మోటార్స్ , సుందరం ఫైనాన్స్ భాగస్వామ్యంతో, సుందరం ఫైనాన్స్ కొత్త 'ఫరెవర్' శ్రేణి కార్లు , యుటిలిటీ వాహనాలప...

Karimnagar news | latest karimnagar news - eenadu

అక్రమార్కుల నుంచి రూ.83 లక్షల రికవరీ అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఐసీడీఎస్‌కు చెందిన ప...

Jagdeep dhankhar: ‘ఆపరేషన్‌ సిందూర్‌.. ’ ఉగ్రమూకలు ఎక్కడున్నా ఏరివేస్తామనే సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖ...

Gt vs lsg: గుజరాత్‌ టైటాన్స్‌కు షాకిచ్చిన లఖ్‌నవూ

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ (IPL) 2025లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ (Lucknow Supergiants).. ...

Top