Droupadi murmu: రాష్ట్రపతి, గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు? సుప్రీంకోర్టుకు ద్రౌపదీ ముర్ము ప్రశ్న..
Droupadi murmu: రాష్ట్రపతి, గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు? సుప్రీంకోర్టుకు ద్రౌపదీ ముర్ము ప్రశ్న.."
Play all audios:
Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించొచ్చా అని ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ప్రశ్నించారు. దిల్లీ: శాసనసభలు ఒకటికి రెండుసార్లు
ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో
ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. దీనిపై ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి
నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న
ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు
తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. * యుద్ధ
విమానాలు నడుపుతున్నారుగా… మహిళలకు ఆ ఉద్యోగాలు ఎందుకివ్వరు? రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవే.. * రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత
అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? * సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? * రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా
నిర్దేశిస్తాయి? * రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? * ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్
రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? ఏంటీ తీర్పు.. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది
ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో
చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే
సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు
ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది.
Trending News
Rahul gandhi: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: రాహుల్ గాంధీచార్మినార్ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాం...
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (25-05-2025) బంధు,మిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస...
Stock market: ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. 25 వేల దిగువకు నిఫ్టీStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠ...
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచింది: ఆరెస్సెస్ చీఫ్పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర...
Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనటెస్టు క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...
Latests News
Droupadi murmu: రాష్ట్రపతి, గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు? సుప్రీంకోర్టుకు ద్రౌపదీ ముర్ము ప్రశ్న..Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించొచ్చా అని ప్రథమ పౌరు...
Operation sindoor: భారత సరిహద్దుల్లో మళ్లీ పాక్ డ్రోన్లు..?కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాక్ దాడులు చేస్తూనే ఉందా? అవుననే అంటున్నాయి డిఫెన్స్ వర్గాలు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని...
Sree vishnu : ఆకట్టుకుంటోన్న శ్రీవిష్ణు రాజ రాజ చోర టీజర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ..Published by: Last Updated:June 18, 2021 12:32 PM IST RAJA RAJA CHORA TEASER : శ్రీవిష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లే...
Rahul gandhi: అందుకే కులగణనకు ప్రధాని మోదీ అంగీకారం: రాహుల్ గాంధీదర్భంగా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ (PM Modi) కులగణనకు అంగీకరించారని లోక్‌స...
Ayodhya ram mandir live updates: అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడుAyodhya Ram Mandir inauguration Live Updates: భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ఇవాళ ...