Indian-american: అప్పట్లోనే గూగుల్‌లో భారతీయ-అమెరికన్‌ టాలెంట్‌కు 100 మిలియన్‌ డాలర్లు..

Eenadu

Indian-american: అప్పట్లోనే గూగుల్‌లో భారతీయ-అమెరికన్‌ టాలెంట్‌కు 100 మిలియన్‌ డాలర్లు.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: దిగ్గజ సంస్థల్లో భారతీయ-అమెరికన్ల హవా కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) వంటి వాటిని ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవకే చెందిన యూట్యూబ్‌


సీఈఓ నీల్‌మోహన్‌ (YouTube CEO Neal Mohan)కు సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్‌గా మారింది. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Zerodha cofounder Nikhil Kamath) పాడ్‌కాస్ట్‌లో ఎంతోమంది


ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా నీల్‌మోహన్‌ కూడా దానిలో మెరిశారు. ఆయనకు 2011 నాటి ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో గూగుల్‌ అడ్వర్టైజింగ్‌, యూట్యూబ్ ప్రొడక్ట్ స్ట్రాటెజీలో ఆయన కీలకంగా ఉన్నారు.


‘‘మీరు వేరే సంస్థకు వెళ్లకుండా ఉండేందుకు గూగుల్ 100 మిలియన్లు ఆఫర్ చేసిందని చదివినట్లు నాకు గుర్తు. 15 ఏళ్ల క్రితం చాలా పెద్దమొత్తం కదా..?’’ అని కామత్ అడిగారు. ఆ ప్రస్తావనను నీల్‌మోహన్‌


తోసిపుచ్చలేదు. * టెక్‌ కంపెనీల్లో 50% తగ్గిన ప్రెషర్ల నియామకాలు 2023 నుంచి యూట్యూబ్‌కు నీల్‌ మోహన్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఆయన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ


పొందారు. అండర్సెన్‌ కన్సల్టింగ్‌ (ప్రస్తుతం యాక్సెంచర్‌)లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత నెట్‌గ్రావిటీకి మారారు. ఆ స్టార్టప్‌ను డబుల్‌క్లిక్ సంస్థ సొంతం చేసుకుంది. అక్కడే


అంచెలంచెలుగా ఎదుగుతూ బిజినెస్‌ ఆపరేషన్స్‌లో వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయిని అందుకున్నారు. 2007లో డబుల్ క్లిక్‌.. గూగుల్‌ పరమైంది. నాటి నుంచి దాని యాడ్ బిజినెస్‌లో కీలకంగా మారారు. గూగుల్ ప్రొడక్ట్


డెవలప్‌మెంట్ స్ట్రాటెజీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆయన టాలెంట్‌ను గుర్తించిన గూగుల్‌ 2011లో ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్)లోకి మారకుండా 100 మిలియన్లు ఆఫర్ చేసి, అట్టిపెట్టుకుంది. అప్పటికే ఆయన


మాజీ బాస్‌ డేవిడ్ రోజెన్‌బ్లాట్‌.. ట్విటర్‌ బోర్డులో చేరారు. చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా నీల్‌ను తీసుకోవాలని ఆయన భావించారు. అప్పుడు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ చేపట్టిన ట్విటర్ దృష్టి నీల్‌మోహన్‌


మీద మాత్రమే పడలేదు. ప్రస్తుత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను కూడా తమ సంస్థలో చేర్చుకోవాలని భావించి ఆఫర్ ఇచ్చింది. 50 మిలియన్‌ డాలర్ల స్టాక్‌ గ్రాంట్‌ ఇచ్చి పిచాయ్‌ను గూగుల్ ఆపేసిందని అప్పట్లో


వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఏ స్థాయికి ఎదిగారో తెలిసిందే. 2015లో గూగుల్‌ సీఈఓ బాధ్యతలు స్వీకరించారు. 2019లో దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్‌ సీఈఓగా నియమితులయ్యారు.


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్లు ఇవే

Lava Shark 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...

Epfo interest rate: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

EPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్‌ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగ...

Manchu manoj: ఆ బాధ నాకు తెలుసు.. విజయ్‌ విషయంలో సారీ: మంచు మనోజ్‌

హైదరాబాద్‌: దర్శకుడు విజయ్ కనకమేడలపై జరిగిన ట్రోలింగ్‌పై నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) స్పందించారు. ‘భైరవం’ ప్రీ రిలీ...

Bandi sanjay: కవిత వ్యవహారం.. అదంతా ఫ్యామిలీ డ్రామా: బండి సంజయ్‌

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay...

Latests News

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై అఖిలపక్షం.. యూసఫ్‌ ఔట్‌.. అభిషేక్‌ బెనర్జీ ఇన్‌

పాక్‌ చర్యలను ఎండగట్టడానికి విదేశాలకు పంపే భారత బృందంలో టీఎంసీ ఎంపీ యూసఫ్‌ పఠాన్‌ స్థానంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెన...

delhi-chunav2020: Latest delhi-chunav2020 News in Hindi - Naidunia

delhi chunav2020Delhi Capitals IPL 2025 Schedule: लखनऊ से होगा दिल्ली कैपिटल्स का पहला मैच, पढ़ें कौन किस पर भारीsports3...

Covid 19: ఆ కొవిడ్‌ పేషంట్‌ను చంపేయ్‌.. ఓ డాక్టర్‌ ఆడియో క్లిప్‌ వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగేళ్ల క్రితం యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ (Coronavirus) మహమ్మారి కకావికలం చేసిన సంగతి తెలిసిం...

Bharat jodo yatra: rahul gandhi unfurls national flag in front of charminar

Congress leader Rahul Gandhi on Tuesday unfurled the national flag in front of the iconic Charminar here, over 32 years ...

‘chitram’ to ‘pulimurugan’, growing up with superstar mohanlal

While watching the Malayalam blockbuster _Chitram_ (1988) on a borrowed VCR, at the age of 3, I didn’t realize that it w...

Top