Covid vaccination: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక జ్వరం వస్తుందా.. దానికి కారణం ఇదే.. తెలుసుకోండి..

Telugu

Covid vaccination: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక జ్వరం వస్తుందా.. దానికి కారణం ఇదే.. తెలుసుకోండి.."

Play all audios:

Loading...

Published by: Last Updated:June 11, 2021 4:08 PM IST COVID VACCINATION: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక కొంత మందికి జ్వరం వస్తుంటే.. మరికొంత మందికి ఒళ్ల నొప్పులు.. లేదా ఆయాసం.. లేదా తీవ్రమైన


తలనొప్పి వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించడానికి గల కారణాలను నిపుణులు ఈ విధంగా తెలిపారు. వివరాలు తెలుసుకోండి. కరోనా టీకా తీసుకున్న తర్వాత కొందరిలో జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, అలసట,


ఆయాసం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా వస్తుందేమోనన్న అపోహ చాలా మందిని కలవరపెడుతోంది. అయితే, టీకా తర్వాత అలాంటి లక్షణాలు చాలా సాధారణమని, శరీరంలో రోగ నిరోధక


వ్యవస్థ పునరుత్తేజమవుతుందని చెప్పడానికి అవే సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. మరికొంత మందిలో ఇవేవీ కనిపించలేదని చెబుతుంటారు. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏదైనా అనారోగ్యం వస్తే లేదా ఏమీ రాకుండా


సాధారణంగా ఉండిపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భౌగోళికంగా ఆయా ప్రాంతాల్లో


ఆయా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ శరీరంలో ఎలా పనిచేస్తున్నదో తెలుసుకుంటున్నారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ కంటే ముందే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినా.. చాలా


తక్కువ సంఖ్యలోనే జరిగాయి. తాజాగా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోట్లకు చేరుకున్న నేపధ్యంలో వైద్య నిపుణులు కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆయా దేశాల్లో పరిస్థితుల ఆధారంగా


శరీరంలోవ్యాక్సిన్ తెచ్చే మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. కరోనా వ్యాక్సన్ వేసుకున్నాక మనిషి శరీరంలో దాని ప్రభావం ఎంత మేరకు ఉందనేది తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. రోగ


నిరోధక వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి.. సహజ వ్యవస్థ. రెండోది.. సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లోకి ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతి చర్య


మొదలుపెడుతుంది. అలా మనం కరోనా టీకా వేసుకోగానే.. తెల్ల రక్తకణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని వల్లే టీకా వేసుకున్న భాగంలో తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా


ఉండటం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. మన రోగ నిరోధక వ్యవస్థలోని ఈ రాపిడ్‌ రెస్పాన్స్‌ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువతలో ఈ ప్రతిస్పందన ఎక్కువగా ఉంటే.. వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది.


advertisement అందుకే వృద్ధుల కంటే యువతలోనే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాలు కన్పిస్తాయి.


అయితే టీకా రెండు డోసులు తీసుకున్నా కొందరిలో జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఉండకపోవచ్చు. అంతమాత్రనా వ్యాక్సిన్‌ పనిచేయట్లేదని కాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక రెండో విషయం


ఏంటంటే.. టీకాలు మన రోగ నిరోధక వ్యవస్థలోని రెండో భాగమైన సముపార్జిత వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయి. టి, బి కణాలు, యాంటీబాడీలు ఇందులోని భాగమే. అసలైన ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది. ఈ వ్యవస్థ


పునరుత్తేజమై శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవే వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. మహిళలు వ్యాక్సిన్ వేసుకున్నాక గడ్డలు కట్టిందని చెబుతుంటారు. అవి క్యాన్సర్ గడ్డలేమోనని


అనుమానిస్తుంటారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకూడదంటే మహిలలు రొమ్ము క్యాన్సర్ నిర్దారణకు మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. advertisement టీకా వల్ల ఎలాంటి లక్షణాలు కల్పించినా అవి


గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. కానీ ఎక్కువ కాలం లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న


ప్రజలందరూ అపోహలకు దూరంగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ స్థాయి తెలిసిపోతుందని.. తక్కువగా ఉంటే వెంటనే పెంచుకోవాల్సిన అవసరం


సూచిస్తుందని చెబుతున్నారు. Location : First Published : June 11, 2021 4:01 PM IST Read More


Trending News

Abvp vidyarthi samskriti chaluvali on feb. 16 &17 - star of mysore

Mysuru:  Akhila Bharatiya Vidyarthi Parishad (ABVP), Mysuru Unit, will be conducting a two-day ABVP Vidyarthi Samskriti ...

Us markets crash: అమెరికా మార్కెట్లూ అతలాకుతలం.. బేర్‌ గుప్పిట్లోకి s&p 500

US markets crash | వాషింగ్టన్‌: అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటన మూలంగా...

Election commission registers kamal haasan's party makkal needhi maiam

Kamal Haasan&nbsp | &nbspPhoto Credit:&nbspBCCL NEW DELHI: Makkal Needhi Maiam (MNM), floated by actor Kamal...

Nagarkurnool: ప్రియురాలిని చూడటానికి రాత్రి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. బంధువులు చూసి ఏం చేశారంటే..?

Published by: Last Updated:June 12, 2022 12:13 PM IST ఈనెల 5న నాగర్​కర్నూల్​లో చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్ర...

Cancer risk: మీరు ఈ ఆహారాలు తింటున్నారా? క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

అధిక ప్రాసెస్ చేయబడిన, సంతృప్త కొవ్వు, చక్కెర , ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రజలు తక్కువగా తినాలని నిపుణులు సిఫార్సు చ...

Latests News

Jathi ratnalu 1st weekend collections: ‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నవ్వుల జాతరకు వసూళ్ల వర్షం..

Published by: Last Updated:March 15, 2021 4:20 PM IST JATHI RATNALU 1ST WEEKEND COLLECTIONS: కరోనా వైరస్ నుంచి కోలుకున్న...

Gold and silver prices today: హైదరాబాద్‌లో రూ. 98,000 దాటిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే..?

Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో...

Contempt notice to nageswara rao, subha ram

New Delhi, Feb 7 (IANS) The Supreme Court on Thursday came down heavily on CBI Joint Director M. Nageswara Rao and prose...

Indian 2: 4 వారాల్లోనే ఓటీటీలోకి ఇండియన్ 2... స్ట్రీమింగ్‌ ప్లాట్ ఫాం ఏదంటే...!

ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా ...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Top