Donald trump: ఆ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ ‘బ్యాడ్‌ కాప్‌’.. హత్య కుట్రపై మండిపడిన ట్రంప్‌

Eenadu

Donald trump: ఆ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ ‘బ్యాడ్‌ కాప్‌’.. హత్య కుట్రపై మండిపడిన ట్రంప్‌"

Play all audios:

Loading...

తన హత్యకు కుట్ర పన్నిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ను


చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీ (James Comey) బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ హత్య కుట్ర (Assassination Threat)పై తాజాగా ట్రంప్‌ స్పందించారు. అతను ఒక బ్యాడ్‌ కాప్‌


అంటూ ట్రంప్‌ కామీపై మండిపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘జేమ్స్‌ కామీకి దాని అర్థం కచ్చితంగా తెలుసు. అతను హత్య చేయాలనుకున్నాడనే విషయం స్పష్టంగా


అర్థమవుతోంది. అతను సమర్థుడు కాకపోవచ్చు. కానీ దాని అర్థం తెలుసుకునే తెలివి ఉంది. కామీ దేశాధ్యక్షుడిని చంపేందుకు పిలుపునిచ్చాడు. అతడు ఒక డర్టీ కాప్‌ (చెడ్డ పోలీస్‌)’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


జేమ్స్‌ కామీ ‘86 47’ అనే పదాలతో ఇన్‌స్టాలో ఒక పోస్టు పెట్టి, డిలీట్‌ చేశారు. 47వ అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా ఆ రహస్య కోడ్‌ ఉందని అధికారులు తెలిపారు. దీంతో అతడి చర్యలపై అమెరికా


సీక్రెట్‌ సర్వీస్‌ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. తన పోస్ట్‌పై కామీ స్పందిస్తూ.. తాను బీచ్‌వాక్‌ చేస్తున్న సమయంలో చూసిన షెల్‌ల చిత్రాన్ని పోస్ట్‌ చేశానని తెలిపారు. ఆ పోస్ట్‌ను అధికారులు


తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ నంబర్లను హత్యలు చేయడానికి ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదన్నారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశారు. పోస్ట్‌ పెట్టాక తనపై


అసంబద్ధమైన ఆరోపణలు రావడంతో దాన్ని డిలీట్‌ చేసినట్లు వెల్లడించారు. ఇక, దీనిపై ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ స్పందిస్తూ.. కామీ పోస్టుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సీక్రెట్‌


సర్వీస్‌ అధికారులు కామీని తన పోస్టుపై ప్రశ్నించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. * అమెరికా నుంచి డబ్బు.. రెమిటెన్స్‌పై 5% పన్ను! కాగా.. గతంలోనూ ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు


జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ఏర్పాటుచేసిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక దుండగుడు కాల్పులు జరపగా.. ట్రంప్‌


కుడి చెవిపై గాయమైంది. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది వేగంగా స్పందించడంతో ఆయన్ను కాపాడగలిగారు. తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఒక వ్యక్తి ఫెన్సింగ్‌


వద్దకు తుపాకీతో రావడాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతరం కాల్పులు జరిపి అతడిని అరెస్టు చేశాయి. ఆ తర్వాత మరోసారి ట్రంప్‌ పాల్గొన్న ఒక సమావేశానికి దగ్గారగా ఉన్న ఒక కన్వెన్షన్‌ సమీపంలో


మాస్క్‌ ధరించిన ఒక సాయుధ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో AK-47 తుపాకీని మోసుకెళ్లినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. బ్యాగ్‌లో తూటాల మ్యాగజైన్‌ను


కూడా గుర్తించినట్లు తెలిపింది. దీంతో ట్రంప్‌ భద్రతను భారీగా పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. 


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...

Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...

Delhi capitals | latest delhi capitals - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

నాటకరంగ ఘనాపాఠి పీసపాటి

ఆంధ్ర రంగస్థలంలో పద్యనాటకాల స్థానం శిఖరాయమానం. ఈ వైభవానికి ఎందరో మహానటులు పునాదులై నిలిచారు. వారిలో పీసపాటి నరసింహమూర్తి...

Latests News

Donald trump: ఆ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ ‘బ్యాడ్‌ కాప్‌’.. హత్య కుట్రపై మండిపడిన ట్రంప్‌

తన హత్యకు కుట్ర పన్నిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. ఇంటర్నెట...

Donald trump: బైడెన్‌కు క్యాన్సర్‌ సోకితే ఎందుకు రహస్యంగా ఉంచారు? : ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధరణ ఆలస్యం కావడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశ్నించ...

Kitchen tips : ఈ ట్రిక్స్‌తో సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోండి.. నిమిషం కూడా పట్టదు

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Business news | latest business news - eenadu

SAM ALTMAN: సీఈఓ కోసం... ఉద్యోగులందరి రాజీనామా! బిల్‌ గేట్స్‌ - మైక్రోసాఫ్ట్‌ అధినేత. స్టీవ్‌ జాబ్స్‌- ఆపిల్‌ సృష్టికర్త...

Kajal aggarwal: బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top