Friedrich merz: గట్టెక్కిన ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌.. జర్మనీ నూతన ఛాన్సరల్‌గా ఎన్నిక

Eenadu

Friedrich merz: గట్టెక్కిన ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌.. జర్మనీ నూతన ఛాన్సరల్‌గా ఎన్నిక"

Play all audios:

Loading...

జర్మనీ నూతన ఛాన్సలర్‌గా ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ ఎన్నికయ్యారు. పార్లమెంటు ఓటింగ్‌లో తొలుత ఆరు ఓట్ల తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైనప్పటికీ.. రెండో ప్రయత్నంలో గట్టెక్కారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీ


(Germany) నూతన ఛాన్సలర్‌గా కన్జర్వేటివ్‌ నేత ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ (Friedrich Merz) ఎన్నికయ్యారు. పార్లమెంటులో నిర్వహించిన ఓటింగ్‌లో తొలుత ఆరు ఓట్ల తేడాతో అనూహ్యంగా పరాజయం పాలైనప్పటికీ.. రెండో


ప్రయత్నంలో మెజార్టీ సాధించి గట్టెక్కారు. జర్మనీ పార్లమెంటులోని దిగువ సభ ‘బుందెస్టాగ్‌’లో మొత్తం 630 స్థానాలు ఉండగా.. విజయానికి 316 ఓట్లు అవసరం. రహస్య పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్‌లో తొలి


ప్రయత్నంలో మెర్జ్‌కు 310 ఓట్లు మాత్రమే వచ్చాయి. విజయానికి ఆరు ఓట్ల దూరంలో నిలిచిపోయారు. సొంత సంకీర్ణ కూటమికి 328 సీట్లు ఉన్న నేపథ్యంలో.. సులభంగానే గెలుస్తారనే అంచనాలు ఉన్న వేళ అనూహ్యంగా


చుక్కెదురైంది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలి ఓటింగ్‌ (First Ballot)లో ఓటమి పాలైన మొట్టమొదటి నేతగా మెర్జ్‌ నిలిచారు. అనంతరం గంటల వ్యవధిలోనే మరోసారి ఓటింగ్‌ నిర్వహించారు. ఈసారి 325


ఓట్లు సాధించిన ఆయన.. జర్మనీ 10వ ఛాన్సలర్‌గా బాధ్యతల స్వీకరణకు సిద్ధమయ్యారు. * అత్యంత కఠినమైన జైలు మళ్లీ ఓపెన్‌! ఫిబ్రవరిలో నిర్వహించిన జర్మనీ పార్లమెంటు ఎన్నికల్లో ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌కు


చెందిన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ (సీడీయూ), క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ (సీఎస్‌యూ) పార్టీల కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌కు చెందిన సోషల్‌


డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డీపీ) ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే సీడీయూకు సారథ్యం వహిస్తున్న ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ నూతన ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు.


Trending News

Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలి

మరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...

Inma pnitas promo de su web oficial 2021

Inma Pnitas promo de su web oficial 2021 | Infoprovincia ------------------------- Usamos cookies para asegurar que te d...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Vastu tips: దీపావళికి ముందే ఇంట్లో ఈ వస్తువులు తొలగించండి.. లేకపోతే దరిద్రం వెంటాడుతుంది..!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Latests News

Friedrich merz: గట్టెక్కిన ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌.. జర్మనీ నూతన ఛాన్సరల్‌గా ఎన్నిక

జర్మనీ నూతన ఛాన్సలర్‌గా ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ ఎన్నికయ్యారు. పార్లమెంటు ఓటింగ్‌లో తొలుత ఆరు ఓట్ల తేడాతో అనూహ్యంగా ఓటమి పాలై...

Br gavai: సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రమాణస్వీకారం

దిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (Justice BR Gavai) బుధవారం ప్రమాణస్వీకారం...

Satyakumar yadav: మద్యం కుంభకోణం.. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలా వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ...

Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు

పిఠాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో స...

ఉద్యోగ సంఘాల చలో విజయవాడ.. పోలీసుల అనుమతి నిరాకరణ

విజయవాడ: ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన కా...

Top