United nations: 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులకు మృత్యు గండం: ఐరాస హెచ్చరిక

Eenadu

United nations: 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులకు మృత్యు గండం: ఐరాస హెచ్చరిక"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌ (Israel- Gaza conflict) భీకర దాడులతో గాజాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. అక్కడి ప్రజల జీవనం ప్రశ్నార్థంగా మారింది. ఇప్పటికే గాజాను అన్ని వైపులా నిర్బంధించిన


ఇజ్రాయెల్‌ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా


సాయం ఇలాగే కొనసాగితే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందంటూ హెచ్చరించింది.  11 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్‌ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌,


యూకే ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది. ‘‘చిన్నారులతో సహా గాజా వాసులకు ఇటీవల ఐదు ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందింది. అక్కడి పరిస్థితి చాలా


క్లిష్టంగా ఉంది. వారికి మరింత సాయం అవసరం. లేదంటే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మృత్యువాత పడే అవకాశం లేకపోలేదు. అక్కడున్న చిన్నారులు, తల్లులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు’’ అని ఐరాస


ప్రతినిధి టామ్ ప్లేచర్‌ హెచ్చరించారు. * అధికారులూ.. దుబారా వద్దు.. మద్యం, సిగరెట్‌ కట్‌: చైనా మానవతా సాయం విషయంలో ఇజ్రాయెల్ తీరును బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడాలు తీవ్రంగా ఖండించాయి. గాజాకు


మానవతా సాయంపై తమ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే తామంతా ఉమ్మడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. తాజాగా ఇజ్రాయెల్ తీరుపై ఐరాస స్పందించింది. పోషకాహారంతో కూడిన 100 ట్రక్కుల మానవతా సాయాన్ని


గాజాలోకి అనుమతించాలని.. చిన్నారుల ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాలని కోరింది.  


Trending News

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు

దిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వ...

Latests News

United nations: 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులకు మృత్యు గండం: ఐరాస హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌ (Israel- Gaza conflict) భీకర దాడులతో గాజాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. అక్కడి ప్రజల జీవనం...

Mk stalin | latest mk stalin - eenadu

నియోజకవర్గాల పునర్విభజన నష్టాలపై చర్చిద్దాం కలిసిరండి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన నిర...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (12/03/2025)

12/03/2025 09:50(IST) కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌ అంటూ వార్తలు.. హీరో తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు  * బాలీవుడ్‌ నటుడ...

Siddipet news | latest siddipet news - eenadu

పంటలను ముంచిన వడగళ్లు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలతో జనగామ, సిద్దిపే...

Ncb recovers cannabis from comedian bharti singh, husband haarsh limbachiyaa's mumbai residence

Bharti Singh’s name had cropped up during the interrogation of a drug peddler, after which her residence was searched, a...

Top