Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు

Eenadu

Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు"

Play all audios:

Loading...

దిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్‌ విజయ్‌ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో


ఆయన క్షమాపణలను అంగీకరించలేమన్న అత్యున్నత న్యాయస్థానం.. మంత్రి వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరపాలని ఆదేశించింది. అయితే, ప్రస్తుతానికి ఆయన అరెస్టుపై స్టే విధించింది.


‘‘క్షమాపణలు ఎక్కడ చెప్పారు? ఎలా చెప్పారు? సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారు.


మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది. ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న


అభ్యంతరం ఏంటీ?’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశ్నించారు. * పాక్‌ టార్గెట్‌లో గోల్డెన్‌ టెంపుల్‌.. గీత కూడా పడనివ్వని భారత ఆర్మీ ‘‘మీరో ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అలాంటప్పుడు బాధ్యతగా


వ్యవహరించాలి. ప్రతీ పదాన్ని ఆచితూచి మాట్లాడాలి. మీ వీడియోను మేం చూశాం. చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. మీ వ్యాఖ్యల పట్ల యావత్‌ దేశం సిగ్గుపడుతోంది’’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


అనంతరం మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం మంగళవారం ఉదయం 10 గంటల్లోపు సిట్‌ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్‌ డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రానికి చెందని ముగ్గురు ఐపీఎస్‌లు అందులో ఉండాలని,


వారిలో ఒకరు ఎస్పీ ర్యాంక్‌ కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది. అయితే, ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు.. విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. పాకిస్థాన్‌తో


పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనికాధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్‌ షా (Madhya Pradesh minister Vijay Shah) చేసిన


వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆమెను విజయ్‌ షా ‘ఉగ్రవాదుల సోదరి’గా పేర్కొనడంపై దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్‌ హైకోర్టు.. ఆయనపై


కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన క్షమాపణలు చెప్పాలని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది.


Trending News

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Jiohotstar | latest jiohotstar - eenadu

రూ.60 కోట్ల బడ్జెట్‌.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. ఓటీటీలో ఖుషీకపూర్‌ లేటెస్ట్‌ మూవీ.. ఖుషీకపూర్‌, జునైద్‌ఖాన్‌ కీలక పాత్...

Latests News

Vundavalli sridevi | latest vundavalli sridevi - eenadu

గత ఐదేళ్లూ అందరికీ అవమానాలే.. భవిష్యత్తంతా రాజపూజ్యమే శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది.. ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగ...

Mumbai | latest mumbai - eenadu

టీసీఎస్‌లో 42,000 నియామకాలు వార్షిక వేతన పెంపును వాయిదా వేసినా, గత ఆర్థిక సంవత్సరంలో 1.10 లక్షల మంది నిపుణులకు టాటా కన్స...

Ravi teja | latest ravi teja - eenadu

పవన్‌కల్యాణ్‌, రవితేజలతో మల్టీస్టారర్‌.. మల్టీస్టారర్‌ తీయాల్సి వస్తే, పవన్‌కల్యాణ్‌, రవితేజలతో తీస్తానని దర్శకుడు హరీశ్...

Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు

దిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వ...

Yuvagalam | latest yuvagalam - eenadu

ఫిర్యాదుకు వెళ్తే.. తిరిగి మాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసా?: తెదేపా కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో జరిగిన ఘర్షణల్లో తెదే...

Top