Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

Eenadu

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి"

Play all audios:

Loading...

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ కిర్మాణి అభిప్రాయపడ్డాడు ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team


India) స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తాను రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. కోహ్లీ ఇప్పటివరకు భారత్‌ తరఫున 123 టెస్టులు ఆడాడు. 46.85


సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌ (ICC Mens T20 World Cup) గెలిచిన తర్వాత టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తాజాగా రెడ్‌బాల్‌ క్రికెట్‌ నుంచీ


తప్పుకున్నాడు. ఈనేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, 1983 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులోని సభ్యుడైన సయ్యద్‌ కిర్మాణి స్పందించాడు. ‘విరాట్‌ ఆటలో స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అదే అతణ్ని


ప్రత్యేకంగా నిలిపింది. కోహ్లీ యువతకు ప్రేరణగా నిలిచాడు. నాకు తెలిసి అతడు వ్యక్తిగత రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోడు. అలాగే అతడు వీడ్కోలు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికీ


గురై ఉండడు. రిటైర్‌మెంట్‌ అనేది అతడి వ్యక్తిగత నిర్ణయం. ప్రతి క్రికెటరూ ఏదోఒకరోజు రిటైర్‌ కావాల్సిందే. కానీ విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌


దాగిఉంది. ఏది ఏమైనప్పటికీ నేను అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. అతడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా’ అని సయ్యద్‌ కిర్మాణి అన్నాడు. అలాగే ఈ మధ్య క్రికెటర్లు తమ రిటైర్‌మెంట్‌ ప్రకటనలను


సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్నారు. దీనిమీద కూడా కిర్మాణి స్పందించాడు. ‘క్రికెటర్లు ఇలా సోషల్‌ మీడియాలో తమ రిటైర్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటనలు చేయడంలో ఏవిధమైన తప్పూ లేదు. ఇన్‌స్టాగ్రాం లాంటి


వేదికల వల్ల ప్రపంచవ్యాప్తంగా విషయం తెలుస్తుంది’ అని తన అభిప్రాయం వ్యక్తంచేశాడు.


Trending News

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు

దిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వ...

Latests News

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Youth | inspiring yuva stories of success - eenadu

లగేరహో.. సర్క్యూట్‌! కాలేజీ కుర్రాళ్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలెబ్రిటీలు.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘సర్క్యూట్‌ ట్రైనింగ్‌...

Robert DuBois - WPR

Robert DuBoisLatest Posts...

Bs yadiyurappa | latest bs yadiyurappa - eenadu

పోక్సో కేసులో యడియూరప్పకు స్వల్ప ఊరట తనపై నమోదైన పోక్సో కేసు విచారణకు సంబంధించిన విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌...

పంచాయతీ: మమ్మల్ని బలి చేస్తారా!

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించినా వారెవరూ గ్రామాలను పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తున్నారు. భీమవరం: పంచా...

Top