Sourav ganguly: పాక్‌కు అంత సీన్‌ లేదు.. త్వరలోనే మ్యాచులు చూస్తాం: గంగూలీ

Eenadu

Sourav ganguly: పాక్‌కు అంత సీన్‌ లేదు.. త్వరలోనే మ్యాచులు చూస్తాం: గంగూలీ"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 (IPL) సీజన్‌ను బీసీసీఐ వారం రోజులపాటు వాయిదా వేసింది. దాయాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో క్రికెట్


ఆడటం సమంజసం కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, త్వరలోనే మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తామని.. పాకిస్థాన్‌ మరింతకాలం ఒత్తిడి తట్టుకోవడం కష్టమని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ


వ్యాఖ్యానించాడు.  ‘‘ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం ఉంది. దీంతో బీసీసీఐ ఐపీఎల్‌ను వాయిదా వేసింది. ఎందుకంటే భారత్‌కు చెందిన క్రికెటర్లే కాకుండా విదేశీ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. వారి భద్రత


విషయంలో రాజీ పడకూడదు. అయితే, త్వరలోనే ఐపీఎల్‌ 2025 సీజన్ పునఃప్రారంభమవుతుంది. ఇప్పుడు టోర్నీ కీలక దశలో ఉంది. ధర్మశాల, చండీగఢ్, దిల్లీ, జైపుర్‌.. ఇలాంటి మైదానాల్లో కొన్ని మ్యాచులు ఉన్నాయి.


ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ నిర్ణయం సరైందే. గత మ్యాచ్ సమయంలో ఏం జరిగిందో చూశాం. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. బీసీసీఐ తప్పకుండా ఐపీఎల్‌ను పూర్తి చేస్తుంది. ఎందుకంటే ఒత్తిడిని మరింత


కాలం తట్టుకొనేంత సీన్‌ పాక్‌కు లేదు’’ అని గంగూలీ తెలిపాడు. పూర్తి అవగాహనతో ఉన్నాం: హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ ‘‘భారత్ - పాక్‌ మధ్య టెన్షన్ వాతావరణం ఉంది. పంజాబ్, దిల్లీ మ్యాచ్‌ను మధ్యలోనే


రద్దు చేశాం. భద్రతా కారణాలతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్ కింగ్స్‌ ఫ్రాంచైజీ మధ్య సమన్వయం ఉంది. బీసీసీఐ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాం’’ అని


హెచ్‌పీసీఏ సభ్యుడు సంజయ్ శర్మ వెల్లడించారు.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Latests News

Sourav ganguly: పాక్‌కు అంత సీన్‌ లేదు.. త్వరలోనే మ్యాచులు చూస్తాం: గంగూలీ

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 (IPL) సీజన్‌ను బీసీసీఐ వారం రోజుల...

Mea: బలోచిస్థాన్‌లో పేలుడు.. పాక్‌ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్‌

సొంత వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్‌ నిరాధార ఆరోపణలు చేస్తోందని భారత్‌ దుయ్యబట్టింది...

భారత్‌ బంద్‌ పాక్షికం

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా...

నయీం కుడి భుజం శేషన్న జాడేది..?

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఎన్‌కౌ...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Top