Shreyas iyer: ఇది ‘ఇండియన్‌’ ప్రీమియర్‌ లీగ్‌: శ్రేయస్‌ అయ్యర్‌

Eenadu

Shreyas iyer: ఇది ‘ఇండియన్‌’ ప్రీమియర్‌ లీగ్‌: శ్రేయస్‌ అయ్యర్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ఈ రోజు నుంచి


ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయినప్పటికీ ఆయా జట్ల తరఫున విదేశీ ఆటగాళ్లలో తిరిగి ఎంతమంది ఆడుతున్నారనే విషయంలో ఇంకా సందిగ్ధతే కొనసాగుతోంది. ముఖ్యంగా జూన్‌ 11 నుంచి వరల్డ్‌ టెస్ట్‌


ఛాంపియన్‌ షిప్‌ (ICC World Test Championship) ఫైనల్‌ జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. పునఃప్రారంభం కానున్న ఐపీఎల్‌లో పాల్గొనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ


నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) టీమ్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. దీని ద్వారా పంజాబ్‌ కెప్టెన్‌ విదేశీ ఆటగాళ్లనుద్దేశించి ఒక చక్కటి సందేశం ఇచ్చాడు. మొదట ఆ వీడియోలో


ఇద్దరు వ్యక్తులు జోస్‌ ఇంగ్లిస్‌, మార్కస్‌ స్టాయినిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మార్క్‌ ఎన్‌సన్‌ ఐపీఎల్‌కు తిరిగి వస్తున్నారా? లేదా? అని చర్చించుకుంటారు. అప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)


వచ్చి.. ‘‘మీరు చెబుతున్న వాళ్లంతా నిజంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులే. కానీ ఇది ‘ఇండియన్‌’ ప్రీమియర్‌ లీగ్‌’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. విదేశీ ఆటగాళ్లు వచ్చినా.. రాకున్నా.. ఐపీఎల్‌


ఆగదు అనే ఉద్దేశంతో శ్రేయస్‌ ఇలా అన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ (దిల్లీక్యాపిటల్స్‌), వియాన్‌ ముల్డర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌), కగిసో రబాడా (గుజరాత్‌ టైటాన్స్‌),


కోర్బిన్‌ బాష్‌, రికెల్టన్‌ (ముంబయి ఇండియన్స్‌), మార్క్‌ ఎన్సన్‌ (పంజాబ్‌ కింగ్స్‌), లుంగి ఎంగిడి (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు), ఐదెన్‌ మార్‌క్రమ్‌ (లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌) గైర్హాజరీతో


ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న ఐపీఎల్‌ జట్లు ఎంతో కొంత ప్రభావితం కానున్నాయి.


Trending News

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Latests News

Shreyas iyer: ఇది ‘ఇండియన్‌’ ప్రీమియర్‌ లీగ్‌: శ్రేయస్‌ అయ్యర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇ...

Shubman gill: టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగిస్తే.. గుజరాత్‌ కోచ్‌ స్పందనిదే

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఇం...

Cannes 2025: కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ.. ఫొటోలు వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్: తారల సందడితో 78వ కేన్స్‌ చిత్రోత్సవాలు కోలాహలంగా (Cannes Film Festival) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Nani: ఆ సంతృప్తినీ పాక్‌కు మిగల్చకూడదు: నాని ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తమ వల్ల భారత్‌లోని ఓ ప్రాంతంలో సినిమా సక్సెస్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందన్న సంతృప్తినీ పాక్‌కు మనం మిగల్చక...

Top