Jasprit bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదు: సంజయ్ మంజ్రేకర్
Jasprit bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదు: సంజయ్ మంజ్రేకర్"
Play all audios:
జస్ప్రీత్ బుమ్రాకు టెస్ట్ పగ్గాలు అప్పగించకపోవడంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ
(Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. టెస్ట్ ర్యాకింగ్స్‌లో ప్రస్తుతం నం.1 బౌలర్‌గా ఉన్న బుమ్రాకు (Jasprit
Bumrah) సారథ్య బాధ్యతలు అప్పగించనందుకు భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్, అన్ని టెస్టు మ్యాచులు ఆడలేకపోవడం
వంటివాటిని సెలెక్టర్లు కారణాలుగా చూపడాన్ని తప్పుబట్టాడు. ‘జస్ప్రీత్ బుమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదో.. నాకైతే అర్థం కావడం లేదు. అతడు సిరీస్ మొత్తం ఆడలేడన్న కారణంగా కెప్టెన్‌గా
ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే రోహిత్ శర్మ ఇటీవల జరిగిన అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం మూడు మాత్రమే ఆడాడు. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అతడు
కొన్నిసార్లు పూర్తి మ్యాచ్‌లు ఆడలేదు. బుమ్రా విషయంలో వర్తించిన సూత్రాలు గత కెప్టెన్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో ఎందుకు వర్తించలేదు?’ అని సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించాడు.
ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న భారత టెస్టు జట్టును శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే టీమ్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రిషభ్‌పంత్‌ను (Rishabh Pant) ఎంపిక చేశారు. ఈ
సందర్భంగా ‘జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉంటాడా?’ అని విలేకరులు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను అడిగారు. ‘డాక్టర్లు, ఫిజియోలు చెప్పిన ప్రకారం బుమ్రా
సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు’ అని అతడు బదులిచ్చాడు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
Latests News
Jasprit bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదు: సంజయ్ మంజ్రేకర్జస్ప్రీత్ బుమ్రాకు టెస్ట్ పగ్గాలు అప్పగించకపోవడంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన అసంతృప్తిని వ్యక్...
Virat kohli: లఖ్‌నవూపై ఆర్సీబీ విజయం.. ఒకే మ్యాచ్‌లో కోహ్లీ 3 రికార్డులుఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ (IPL) సీజన్ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తూ ఇప్పుడు క్వాలిఫయర్-1 పోరుకు చేరుకుంది రాయ...
Aircraft window shades: విండోషేడ్స్ మూసి ఉంచాలి: వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక సూచనఇంటర్నెట్డెస్క్: వాణిజ్య విమానాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక సూచన చేసింది. రక్షణశాఖ వైమానిక స్థ...
Mock drill: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై సరిహద్దు జిల్లాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటర్...
Arjun son of vyjayanthi: మరో ఓటీటీలోకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. ఎక్కడంటేఇంటర్నెట్డెస్క్: కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son...