Aircraft window shades: విండోషేడ్స్‌ మూసి ఉంచాలి: వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక సూచన

Eenadu

Aircraft window shades: విండోషేడ్స్‌ మూసి ఉంచాలి: వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక సూచన"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: వాణిజ్య విమానాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక సూచన చేసింది. రక్షణశాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయంలో విండో షేడ్స్‌


(కిటికీలను కవర్ చేసే వస్త్రం లేక ఇతర మెటీరియల్)ను మూసివేయాలని ఆదేశించింది. మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్‌ అయిన


తర్వాత 10వేల అడుగుల ఎత్తుకు వెళ్లేవరకు, ల్యాండింగ్ సమయంలో ఈ ఎత్తుకు దిగిన తర్వాత ఆ నిబంధన వర్తిస్తుంది. ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఇందుకు మినహాయింపు ఉందని తెలిపింది (Aircraft window


shades). పాకిస్థాన్‌తో ఇటీవల ఘర్షణలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి భారత బలగాలు ఆపరేషన్ సిందూర్‌తో గట్టి బదులిచ్చాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ రెచ్చగొట్టే


చర్యలకు పాల్పడింది. వాటిని భారత్ తిప్పికొట్టింది. తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. కానీ దౌత్యపరమైన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ


నేపథ్యంలోనే డీజీసీఏ సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే.. సైనిక స్థావరాల వద్ద ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి ప్రయాణికులను అప్రమత్తం చేయాలని సూచించింది. వాటిని


ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన చర్యల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థల నిర్వాహకులకు స్పష్టంచేసింది. ఆపరేషనల్ సేఫ్టీతో పాటు ప్రయాణికులు తమకు తెలియకుండానే రక్షణపరమైన సమాచారాన్ని షేర్ చేయకుండా


నిరోధించేందుకే ఈ చర్యలని తన ప్రకటనలో పేర్కొంది. లేహ్, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్‌, ఆదంపుర్‌, చండీగఢ్‌, బఠిండా, జైసల్మేర్‌, నాల్‌, జోధ్‌పుర్, హిండన్‌, ఆగ్రా, కాన్పుర్‌, బరేలీ, మహారాజ్‌పుర్‌,


గోరఖ్‌పుర్‌, భుజ్‌, లొహెగావ్‌, డాబోలిమ్‌(గోవా) , వైజాగ్‌లోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. ఇదిలాఉంటే.. పాకిస్థాన్‌కు చెందిన విమానాలు భారత గగనతలాన్ని వినియోగించకుండా


కేంద్ర ప్రభుత్వం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. గతంలో విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని జూన్‌ 23 వరకు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


మరోవైపు.. భారత విమానాలకు గగనతల మూసివేతను పాకిస్థాన్‌ మరో నెల పాటు పొడిగించింది. జూన్‌ 24 తెల్లవారుజామున 4.59 గంటల వరకు తమ గగనతలంలో భారత విమానాలను నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్‌ విమానాశ్రయ


అధికారులు (పీఏఏ) వాయు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ నిబంధనల ప్రకారం నెల కంటే ఎక్కువ రోజులు గగనతలం వినియోగించకుండా అడ్డుకోవడం కుదరదు.


అయితే.. ఇరుదేశాలూ నిషేధం గడువును పొడిగించాయి.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

Latests News

Aircraft window shades: విండోషేడ్స్‌ మూసి ఉంచాలి: వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక సూచన

ఇంటర్నెట్‌డెస్క్‌: వాణిజ్య విమానాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక సూచన చేసింది. రక్షణశాఖ వైమానిక స్థ...

Mock drill: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌

 అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై సరిహద్దు జిల్లాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  ఇంటర్...

Arjun son of vyjayanthi: మరో ఓటీటీలోకి ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’.. ఎక్కడంటే

ఇంటర్నెట్‌డెస్క్‌: కల్యాణ్ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి (Arjun Son...

Ntr birth anniversary and mini mahanadu celebrated in california: కాలిఫోర్నియాలో ఎన్టీఆర్‌ జయంతి, మినీ మహానాడు సందడి

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలోని బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు...

Manchu vishnu: ‘కన్నప్ప’ విషయంలో చేసిన పెద్ద తప్పు అదే: మంచు విష్ణు

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్య...

Top