Rcb vs kkr: ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే?

Eenadu

Rcb vs kkr: ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే?"

Play all audios:

Loading...

బెంగళూరు: భారత్‌, పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 (IPL).. నేడు జరగనున్న ఆర్సీబీ (Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) మ్యాచ్‌తో


పునఃప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే స్టేడియం వద్ద సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి


ఉంచారు. ఇప్పటికే టాస్ వేయాల్సిన సమయం కూడా మించిపోయింది. స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో మ్యాచ్‌ జరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 15 నిమిషాల్లోనే మ్యాచ్‌కు సిద్ధం 


చిన్నస్వామి స్టేడియంలో ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సబ్ ఎయిర్ డ్రైనేజ్ సిస్టమ్ సాయంతో ఎంత వర్షం కురిసినా కేవలం 15- 20 నిమిషాల్లోనే మ్యాచ్ నిర్వహణకు వీలుగా స్టేడియంను సిద్ధం చేయొచ్చు.


2017లో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ సబ్ ఎయిర్ సిస్టమ్‌తో నిమిషానికి 10వేల లీటర్ల నీటిని బయటకు పంపే పైపులు ఉన్నాయి. ఇందులోని ఇంటిగ్రేటెడ్ సెన్సార్లు చిత్తడి


అవుట్ ఫీల్డ్‌ను నిమిషాల్లో డ్రై చేయగలవు. దాదాపు 200మంది ఈ వ్యవస్థను క్రమబద్ధం చేస్తూ 15 నిమిషాల్లో ఆటకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేస్తారు.  మ్యాచ్ రద్దయితే..  ఎడతెరిపి లేకుండా వర్షం పడి ఈ


మ్యాచ్‌ రద్దయితే కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరవుతాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 11 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్‌ రద్దయితే ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు చివరి లీగ్‌


మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచినా 14 పాయింట్లతోనే ఉంటుంది. ప్రస్తుతం స్థితిలో 14 పాయింట్లతో టాప్‌-4లో నిలవడం అసాధ్యం. ఇక, ఈ మ్యాచ్ రద్దయితే బెంగళూరుపై పెద్దగా ప్రభావం ఉండదు. ఇప్పటివరకు 11


మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 16 పాయింట్లతో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. కేకేఆర్‌తో మ్యాచ్ రద్దయితే ఒక పాయింట్ వస్తుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఒక దాంట్లో గెలిచినా చాలు. ఒకవేళ ఆ రెండు


మ్యాచ్‌ల్లో ఓడినా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌ ఛాన్స్ ఉంటుంది.


Trending News

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...

Chandrababu: మార్కాపురంలో చంద్రబాబు పర్యటన.. మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించిన సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. మార్కాపురం...

Dilruba: కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రూబా’.. విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaraam) హీరోగా దర్శకుడు విశ్వకరుణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘దిల్‌ రూబా’ (Dil...

Arjun kapoor and parineeti chopra wrap up punjab schedule of namaste england

Arjun Kapoor, Parineeti Chopra on the poster of Namaste England&nbsp The much-loved pair of _Ishaqzaade_ - Arjun Kap...

Latests News

Ttd news: అతిభారీ వర్షాలు.. భక్తులకు టీటీడీ తాజా హెచ్చరిక!

Reported by: Published by: Last Updated:December 05, 2023 9:30 AM IST తిరుమల వెళ్తున్నారా? అయితే మీకు అలర్ట్. టీటీటీ వెం...

Asia cup | latest asia cup - eenadu

ASIA CUP 2023: ఆసియా కప్‌.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌కు భారీ నజరానా ఆసియా కప్‌ టోర్నీ (Asia Cup 2023)లో భాగంగా కొలం...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news

‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...

Mansi moghe latest news in hindi, photos, videos on mansi moghe inextlive jagran

इंदौर की ये खूबसूरत बाला करेगी मिस यूनिवर्स में भारत का प्रतिनिधित्व i-exclusive12 years ago इंदौर की मानसी मोघे को मिस ...

Top