Mi vs gt: అసలైన డ్రామా.. ఆ మూడు ఓవర్లే ముంబయిని ఓడించాయి
Mi vs gt: అసలైన డ్రామా.. ఆ మూడు ఓవర్లే ముంబయిని ఓడించాయి"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: లక్ష్యం 156 పరుగులు. టీ20ల్లో ఇదేమీ పెద్ద కష్టం కాదు. కానీ, బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కఠినమే. అందుకు తగినట్టుగానే ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్లు
కట్టుదిట్టంగా బౌలింగ్ ఎటాక్‌ను మొదలుపెట్టారు. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం మలుపులు తిరిగి చివరికి గుజరాత్ టైటాన్స్ వైపే విజయం వచ్చి చేరింది. మొదట్లో అదరగొట్టిన ముంబయి ఆఖరికి
ఓడిపోవడానికి కారణం మూడు ఓవర్లు మాత్రమే. దీంతో ముంబయి వరుస ఆరు విజయాలకు గుజరాత్ చెక్ పెట్టినట్లైంది. తొలి స్టెప్.. 8వ ఓవర్.. కెప్టెనే ముందుండి.. ముంబయి బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్
బుమ్రా, దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బంతులేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 29/1. తర్వాత (7వది) ఓవర్‌లో దీపక్ చాహర్ 11 పరుగులు ఇచ్చాడు. దీంతో గుజరాత్ ఏడు ఓవర్లకు 40/1తో ఉంది.
అప్పటికే వర్షం పడుతుందేమోనని అనిపించింది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ 46/1 ఉండాలి. అంటే ఆరు పరుగులు వెనకబడి ఉంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య
సుదీర్ఘమైన ఓవర్ సంధించాడు. మొదటి మూడు బంతులకు ఆరు పరుగులు ఇచ్చిన పాండ్య.. తర్వాత ఒక సిక్స్, రెండు నోబాల్స్, మూడు వైడ్లతో కలిపి ఆ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు సమర్పించాడు. ఇదే గుజరాత్
ఇన్నింగ్స్‌కు ఊపిరిపోసింది. డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం 8 ఓవర్లకు 53/1 ఉంటే చాలు. కానీ, గుజరాత్ అప్పటికే 58/1 స్కోరు సాధించింది. సెకండ్ స్టెప్.. మార్చేసిన 13వ ఓవర్ ఆ తర్వాత ముంబయి బౌలర్లు
మళ్లీ కట్టుదిట్టంగా బంతులేసి గుజరాత్ (Gujarat Titans)ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. కీలకమైన జాస్ బట్లర్ (30)ను అశ్విని కుమార్ ఔట్ చేశాడు. ఈ సమయంలో వర్షం భారీగా మ్యాచ్ రద్దై ఉంటే
ముంబయికి రెండు పాయింట్లు కలిసొచ్చేవి. ఎందుకంటే అప్పటికి గుజరాత్ స్కోరు 12 ఓవర్లకు 79/2. ఎందుకంటే డ/లూ పద్ధతి ప్రకారం 84 పరుగులు చేసి ఉండాలి. ఎప్పుడైతే బట్లర్ ఔటై రూథర్‌ఫోర్డ్ వచ్చాడో
గుజరాత్ పరిస్థితి మారిపోయింది. 13వ ఓవర్ తొలి మూడు బంతులకు ఒక్క పరుగూ రాలేదు. ఆ తర్వాత వైడ్ ఇచ్చిన విల్ జాక్స్‌కు రూథర్‌ఫోర్డ్ వరుసగా రెండు ఫోర్లు, సిక్స్‌తో చుక్కలు చూపించాడు. ఒక్కసారిగా
మ్యాచ్ స్వరూపం మారిపోయింది. గుజరాత్ ముందుకు దూసుకుపోయింది. 14వ ఓవర్‌లోనూ 13 పరుగులు వచ్చేశాయి. ఆ తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఒకవేళ అప్పుడే రద్దైనా జీటీదే విజయం. దాదాపు
అరగంట తర్వాత మళ్లీ మ్యాచ్ పునఃప్రారంభమైంది. థర్డ్ స్టెప్.. ఆఖరి ఓవర్ ఇలా.. 15వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు కేవలం 25 పరుగులే ఇచ్చిన బుమ్రా, బౌల్ట్ నాలుగు వికెట్లు తీసి ముంబయిని మంచి
స్థితిలో ఉంచారు. 19వ ఓవర్ వేసే సమయంలో భారీ వర్షం వచ్చేసింది. అప్పటికే గుజరాత్ ఐదు పరుగులు వెనకబడి ఉంది. పాపం ముంబయికి కలిసిరాలేదు. వర్షం తగ్గడంతో 19 ఓవర్లకు 147 పరుగులను టార్గెట్‌గా
నిర్దేశించారు. అంటే ఆరు బంతుల్లో 15 పరుగులు గుజరాత్ లక్ష్యం. అప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబయి ఓ ఫీల్డర్‌ను ఇన్నర్ రింగ్‌లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తొలి మూడు బంతుల్లోనే
సిక్స్, ఫోర్ సహా 11 పరుగులను దీపక్ చాహర్ ఇచ్చేశాడు. నాలుగో బంతిని నోబాల్‌గా సంధించాడు. ఫ్రీహిట్ వచ్చేసింది. కానీ, తెవాతియా సింగిల్ మాత్రమే కొట్టగలిగాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. అంటే
చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు చేస్తే చాలు. ఐదో బంతికి కోయిట్జీని దీపక్ ఔట్ చేశాడు. చివరి బంతికి ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా? అని ముంబయి అభిమానులు ఆశించారు. కానీ, అర్షద్ ఖాన్ సింగిల్ తీసి
గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అయితే, రనౌట్ చేసే అవకాశం చేజారడంతో ముంబయి మ్యాచ్ కూడా కోల్పోవాల్సి వచ్చింది.
Trending News
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్ షెడ్యూలు విడుదలస్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...
Game changer: ‘గేమ్‌ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Latests News
Mi vs gt: అసలైన డ్రామా.. ఆ మూడు ఓవర్లే ముంబయిని ఓడించాయిఇంటర్నెట్ డెస్క్: లక్ష్యం 156 పరుగులు. టీ20ల్లో ఇదేమీ పెద్ద కష్టం కాదు. కానీ, బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కఠినమే. అంద...
హైదరాబాద్ ఎంఎంటీఎస్‌పై నీలినీడలుఇప్పటికే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు పూర్తవుతాయా అనే సందేహం నెలక...
Humsafar express: హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలుశనివారం మధ్యాహ్నం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(Humsafar Express) రైల్లో మంటలు చెలరేగాయి. గుజరాత్‌లోని వల్సాడ్ స్టేషన్ సమీపంలో...
Jammu kashmir: జమ్మూ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు.. తిప్పికొడుతున్న సైన్యంఇంటర్నెట్ డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన...
డబ్లిన్‌లో వైభవంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సంశ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని స్థానిక VHCCI ఆలయంలో నిర్వహించార...