Gautam gambhir - rohit sharma: ఎవరు వీరంతా? మేమిద్దరం ఎప్పుడైనా అలా భావించామా? : గౌతమ్‌ గంభీర్

Eenadu

Gautam gambhir - rohit sharma: ఎవరు వీరంతా? మేమిద్దరం ఎప్పుడైనా అలా భావించామా? : గౌతమ్‌ గంభీర్"

Play all audios:

Loading...

Gautam Gambhir: భారత జట్టు టెస్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.  ఇంటర్నెట్ డెస్క్: రోహిత్ శర్మ (Rohit Sharma)


టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సిన క్రమంలో నిర్ణయం తీసుకోవడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్, చీఫ్‌ సెలక్టర్


అజిత్ అగార్కర్ తనను ఎంపిక చేసే అవకాశాలు తక్కువేనని భావించడంతోనే రోహిత్ వీడ్కోలు పలికినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సోషల్ మీడియాలో గంభీర్‌తో సయోధ్య లేకపోవడం వల్లే రోహిత్ ఈ


నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై గంభీర్‌ తీవ్రస్థాయిలో స్పందించాడు. ఇదంతా యూట్యూబ్‌లో టీఆర్పీ కోసం చేస్తున్నారని మండిపడ్డాడు. ‘‘అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారంతా ఎవరు?


కేవలం సోషల్ మీడియాలోనే ఇలాంటివి వస్తున్నాయి. ఇందులో మాట్లాడే ఎక్స్‌పర్స్ట్ ఎవరు? వీరంతా యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కోసం, టీఆర్పీ రేటింగ్‌ల కోసమే మాట్లాడతారు. రెండు నెలల కిందట మేం ఛాంపియన్స్‌


ట్రోఫీని గెలిచాం. ఒకవేళ మేం సాధించకపోయి ఉంటే.. అప్పుడు మీరేం అడిగి ఉండేవారు? కోచ్‌ - కెప్టెన్ కలిసి ఛాంపియన్‌గా నిలిపాం. ఇలాంటప్పుడు కూడా మీరు నాకు, రోహిత్‌కు మధ్య ఏదో ఉందని ఎలా అడగగలరు?’’


అని గంభీర్‌ (Gautam Gambhir) వ్యాఖ్యానించాడు. మా అనుబంధం ఇలా.. ‘‘నేను ఎప్పుడూ మనిషిని మనిషిగానే గౌరవిస్తా. భారత క్రికెట్‌కు అతడేం చేశాడనేది అందరికీ తెలుసు. ఆ విషయంలో రోహిత్‌పై ఎప్పుడూ గౌరవం


ఉంటుంది. అతడు జట్టులోకి వచ్చిన తొలినాళ్ల నుంచి చూస్తూనే ఉన్నా. ఇలాంటప్పుడు కూడా పదేపదే మా మధ్య ఉన్న సంబంధాలపై ఇంకా ప్రశ్నలు అడగడం సరైంది కాదు. టీఆర్పీ కోసం, యూట్యూబ్ ఛానల్‌ను


నిర్వహించుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు అడగాలనుకుంటే అందుకు హోంవర్క్‌ చేసుకొని రావాలని చెబుతా’’ అని గంభీర్‌ తెలిపాడు. రోహిత్ నాయకత్వంలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను ఓడిపోవడంతో అప్పుడే అతడిపై


వేటు పడుతుందని అంతా భావించారు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం రోహితే వీడ్కోలు చెబుతాడని ఊహించారు. దాదాపు ఐదు నెలల తర్వాత అనూహ్యంగా ఇప్పుడు నిర్ణయం ప్రకటించడం గమనార్హం.


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Pm modi: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే ప్రధాని నరేంద్ర ...

Latests News

Gautam gambhir - rohit sharma: ఎవరు వీరంతా? మేమిద్దరం ఎప్పుడైనా అలా భావించామా? : గౌతమ్‌ గంభీర్

Gautam Gambhir: భారత జట్టు టెస్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడం క్రికెట్ వర్గాల్లో స...

Operation sindoor: రాజౌరి దాడుల్లో ప్రభుత్వ అధికారి సహా ఐదుగురి మృతి.. ఆ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దం

Operation Sindoor: పాక్ దాడుల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయారు. రాజౌరిలో తన ఇంటిపై పడిన ...

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Bsf jawan: నిద్రపోనివ్వకుండా రహస్యాలు అడిగి: పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు

BSF jawan: కస్టడీలో ఉండగా బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను పాక్‌ అధికారులు దూషించి, వేధించినట్లు తెలుస్తోంది.  ఇంటర్నెట్‌డెస్క్‌: పాక...

Assam: aasu stages anti-caa protests in north lakhimpur

The Lakhimpur district unit of the All Assam Students Union (AASU) on Saturday staged a massive demonstration in Assam’s...

Top