Bsf jawan: నిద్రపోనివ్వకుండా రహస్యాలు అడిగి: పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు
Bsf jawan: నిద్రపోనివ్వకుండా రహస్యాలు అడిగి: పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు"
Play all audios:
BSF jawan: కస్టడీలో ఉండగా బీఎస్‌ఎఫ్ జవాన్‌ను పాక్ అధికారులు దూషించి, వేధించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌డెస్క్: పాక్ రేంజర్ల నిర్బంధంలో గత 21 రోజులుగా ఉన్న సరిహద్దు భద్రతా దళం
(బీఎస్‌ఎఫ్) జవాన్ (BSF jawan) పూర్ణమ్ కుమార్ షా విడుదలైన సంగతి తెలిసిందే. పాక్ (Pakistan) అదుపులో ఉన్నప్పుడు ఆయనను నిద్ర పోనివ్వలేదని, దూషించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
నిర్బంధంలో ఉన్నన్ని రోజులు పాక్ అధికారులు పూర్ణమ్‌ను మూడు ప్రాంతాల్లో తిప్పి ఒక లొకేషన్‌లో జైలు సెల్‌లో ఉంచారు. వారివద్ద ఉన్నన్ని రోజులు చాలావరకు కళ్లకు గంతలు కట్టే ఉంచారని సమాచారం. ఆయనను
శారీరకంగా హింసకు గురిచేయలేదు కానీ.. మాటలతో మాత్రం వేధింపులకు గురిచేశారని ఆ వర్గాలు వెల్లడించాయి. కనీసం నిద్ర పోనివ్వలేదని, బ్రష్ చేసుకోవ్వలేదని తెలిపాయి. అలాగే సరిహద్దులో మోహరింపు గురించి,
అక్కడ ఉండే సీనియర్ అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాయి. కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని ఆ అధికారులు ఒత్తిడి చేశారని తెలుస్తోంది. అయితే బీఎస్‌ఎఫ్ నిబంధనల ప్రకారం ఆయన
వద్ద ఎలాంటి ఫోన్ లేకపోవడంతో వారికి వివరాలు అందలేదు. ఇక ఈ ప్రశ్నలన్నీ అడిగిన అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నారట. * ‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’: కర్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం
సీరియస్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రైతులకు రక్షణగా గత నెల 23న గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పూర్ణమ్ అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనబడటంతో
దానికింద విశ్రాంతి తీసుకున్నారు. అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. పాకిస్థాన్ రేంజర్స్ ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. జవాన్ విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు ఆరు
సార్లు చర్చలు జరిపాయి. మరోవైపు పూర్ణమ్ కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. గర్భిణి అయిన ఆయన భార్య.. భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. కొన్నాళ్లపాటు భారత్ అధికారుల అభ్యర్థనలు
పట్టించుకోకుండా పాక్ రేంజర్లు కాలయాపన చేశారు. అయితే ఈనెల మొదటివారంలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్ రేంజర్ మహమ్మదుల్లాను బీఎస్‌ఎఫ్ అదుపులోకి
తీసుకుంది. దీంతో పాకిస్థాన్ పైనా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే పూర్ణమ్‌ను విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్ కూడా పాక్ రేంజర్‌ను అప్పగించింది.
Trending News
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and ritualsKrishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...
Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...
Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bailKOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్‌బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Latests News
Bsf jawan: నిద్రపోనివ్వకుండా రహస్యాలు అడిగి: పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులుBSF jawan: కస్టడీలో ఉండగా బీఎస్‌ఎఫ్ జవాన్‌ను పాక్ అధికారులు దూషించి, వేధించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌డెస్క్: పాక...
Assam: aasu stages anti-caa protests in north lakhimpurThe Lakhimpur district unit of the All Assam Students Union (AASU) on Saturday staged a massive demonstration in Assam’s...
Drone like objects: రాత్రి వేళ కోల్‌కతాలో డ్రోన్ల లాంటి వస్తువుల కలకలం.. పోలీసుల అప్రమత్తంకోల్కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ఇటీవల రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు (Drone like objects)...
Stock market: ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. 25 వేల దిగువకు నిఫ్టీStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠ...
Uttar pradesh news | latest uttar pradesh news - eenaduATIQ AHMAD: అతీక్ రాసిన ‘రహస్య లేఖ’.. యూపీ సీఎం, సీజేఐల కోసమే! హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ‘ర...