R ashwin: రోహిత్‌ను టార్గెట్‌ చేశారని విమర్శలు.. సమాధానమిచ్చిన అశ్విన్‌

Eenadu

R ashwin: రోహిత్‌ను టార్గెట్‌ చేశారని విమర్శలు.. సమాధానమిచ్చిన అశ్విన్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటమే లేకుండా అద్భుత ప్రదర్శన కొనసాగించిన టీమ్‌ఇండియా మరోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy) ని ముద్దాడింది. ఈ విజయంతో భారత్‌లో సంబరాలు మిన్నంటాయి. అయితే..


ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా మాజీ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) పెట్టిన ఓ ట్వీట్‌ విమర్శలకు తావిచ్చింది. తనపై ట్రోలింగ్‌ పెరగడంతో.. వాటికి అశ్విన్‌ సమాధానం ఇచ్చాడు. న్యూజిలాండ్‌


(IND vs NZ) బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ముందుగానే తీసుకురావడంపై అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. ఇది తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. సరైన నిర్ణయం కాదని


పేర్కొన్నాడు. దీంతో పలువురు అభిమానులు అశ్విన్‌పై మండిపడ్డారు. రోహిత్‌ కెప్టెన్సీని టార్గెట్‌ చేస్తారా..? అంటూ విమర్శలు గుప్పించారు. విమర్శలపై అశ్విన్‌ స్పందిస్తూ.. తన పోస్టుపై వివరణ ఇస్తూ తన


ఉద్దేశం అది కాదని పేర్కొన్నాడు. రోహిత్‌ కెప్టెన్సీ గురించి తాను ఎక్కడా పేర్కొనలేదని స్పష్టంచేశాడు. ‘‘నేను పెట్టిన ట్వీట్‌ కెప్టెన్సీ గురించి అని భావించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.


అభిమానుల పిచ్చితనం ఇది. వరుణ్‌ను ముందుగానే బౌలింగ్‌ అటాక్‌లోకి తేవాలని న్యూజిలాండ్‌ ఆటతీరు మనపై ఎలా ఒత్తిడి తెచ్చిందో చెప్పడానికే ఆ ట్వీట్‌ ’’ అని వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి


రెండు కీలక వికెట్లు తీసి విజయంలో భాగమయ్యాడు. మొత్తంగా ఈ టోర్నీలో 9 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మ్యాట్‌ హెన్రీ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. షమీ తల్లి పాదాలను తాకిన


కోహ్లీ.. ఇక మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అందరిలో ప్రత్యేకంగా నిలిచాడు. తన ప్రవర్తనతో మరోసారి అందరి మనసులు


గెలుచుకున్నాడు. పేసర్‌ మహమ్మద్‌ షమీ కుటుంబంతో కలిసి కోహ్లీ ఫొటోలు దిగాడు. ఈసందర్భంగా షమీ తల్లి పాదాలను తాకాడు. ఆమెపై కోహ్లీ చూపించిన గౌరవానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.


Trending News

Piper pa-34-200-2 seneca, g-badl, 12 november 1995

PIPER PA-34-200-2 SENECA, G-BADL, 12 NOVEMBER 1995 CONTENTS * Piper PA-34-200-2 Seneca, G-BADL * Download report PIPER P...

Pbks vs mi: శ్రేయస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌... ఐపీఎల్‌ ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్ కింగ్స్‌ ఐపీఎల్ 2025 సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను చి...

Group 1 exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..!

Published by: Last Updated:August 22, 2024 11:44 AM IST APPSC: ఏపీలో జరగాల్సిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్త...

delhi-chunav2020: Latest delhi-chunav2020 News in Hindi - Naidunia

delhi chunav2020Delhi Capitals IPL 2025 Schedule: लखनऊ से होगा दिल्ली कैपिटल्स का पहला मैच, पढ़ें कौन किस पर भारीsports3...

Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..

Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...

Latests News

R ashwin: రోహిత్‌ను టార్గెట్‌ చేశారని విమర్శలు.. సమాధానమిచ్చిన అశ్విన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటమే లేకుండా అద్భుత ప్రదర్శన కొనసాగించిన టీమ్‌ఇండియా మరోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Troph...

Subramanya swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!

Reported by: Published by: Last Updated:November 02, 2024 2:28 PM IST ఇప్పటివరకు వందలాది మంది దంపతుల కోరికలు ఈ ఆలయంలో నె...

Business Latest News | Latest Financial News - Eenadu

TRENDING IPL 2025 Rains Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు...

Emmanuel macron: మెక్రాన్‌ దంపతుల చిర్రుబుర్రులాట క్లిప్ వైరల్‌.. రష్యా వెటకారం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్...

Ipl 2025: వైభవ్‌ సూర్యవంశీకి 500 ఫోన్‌కాల్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తాను ఆడిన...

Top