Pbks vs mi: శ్రేయస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌... ఐపీఎల్‌ ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌

Eenadu

Pbks vs mi: శ్రేయస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌... ఐపీఎల్‌ ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్ కింగ్స్‌ ఐపీఎల్ 2025 సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన

ముంబయి 203/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ (87*) దంచికొట్టాడు. కెప్టెన్సీ

ఇన్నింగ్స్‌తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. నేహల్‌ వధేరా (48: 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోష్‌ ఇంగ్లిస్‌ (38: 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్

బెంగళూరుతో పంజాబ్ టైటిల్‌ కోసం తలపడనుంది. ముంబయి బౌలర్లలో అశ్వని కుమార్‌ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్య ఒక్కో వికెట్‌ తీశారు. 2014 తర్వాత పంజాబ్‌ జట్టు ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.

మొత్తంగా ఇది రెండోసారి.  తొలుత సూర్యకుమార్‌ యాదవ్‌ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (44: 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్‌ స్టో (38: 24 బంతుల్లో 3 ఫోర్లు, 2

సిక్స్‌లు) నమన్‌ ధీర్‌ (37: 18 బంతుల్లో 7 ఫోర్లు రాణించడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో ఒమర్జాయ్‌ 2, జెమీసన్‌, స్టాయినిస్‌, చాహల్‌,

వైశాక్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  ఫైనల్‌లో ఎవరు గెలిచినా.. కొత్త ఛాంపియనే మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - పంజాబ్ కింగ్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఇందులో

ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్‌ వచ్చినట్టే. ఇప్పటి వరకు పంజాబ్, బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్‌ను నెగ్గలేదు.

Trending News

Who: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్ర స్థాయిలో  (Israel-Hamas Conflict) దాడులతో విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు పె...

Pbks vs mi: శ్రేయస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌... ఐపీఎల్‌ ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్ కింగ్స్‌ ఐపీఎల్ 2025 సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను చి...

Latests News

Top