Virat kohli: నిన్ను మిస్సవుతున్నా.. కోహ్లీ రిటైర్మెంట్‌పై గంభీర్‌

Eenadu

Virat kohli: నిన్ను మిస్సవుతున్నా.. కోహ్లీ రిటైర్మెంట్‌పై గంభీర్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC).. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) రిటైర్‌మెంట్‌ నిర్ణయంపై స్పందించాయి. టెస్టుల్లో తన 14 సంవత్సరాల కెరీర్‌కు కోహ్లీ సోమవారం ముగింపు పలికాడు. ఈ


నేపథ్యంలో బీసీసీఐ.. ఎక్స్‌ ఖాతాలో స్పందించింది. ‘థ్యాంక్యూ విరాట్‌ కోహ్లీ. టెస్ట్‌ క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. కానీ వారసత్వం మాత్రం నిరంతరం కొనసాగనుంది’ అని కీర్తించింది.  కిరీటం చెక్కు


చెదరలేదు ‘విరాట్‌ టెస్టు జట్టు నుంచి వైదొలగినా... కిరీటం చెక్కుచెదరలేదు. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, సాటిలేని వారసత్వాన్ని మిగిల్చాడు’ - ఐసీసీ  నిన్ను మిస్సవుతున్నా ‘సింహంలాంటి


మనిషీ.. నేను నిన్ను మిస్సవుతున్నా...!’ - గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి ‘విరాట్‌కు అభినందనలు. నిన్ను చూసినప్పటి నుంచి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివని తెలుసు.


టెస్ట్ క్రికెట్ ఆడిన తీరు, అందులోని ఉత్సాహం చూడటానికి చాలా ఆనందంగా ఉంది. నువ్వు టెస్ట్ క్రికెట్‌కు గొప్ప రాయబారివి, వన్డే క్రికెట్‌లో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ - వీరేంద్ర సెహ్వాగ్‌


  అతడు నిజమైన టార్చ్‌ బేరర్‌  ‘కోహ్లీ నాకు ఆదర్శం, టెస్ట్‌ క్రికెట్‌లో అతడి ఆధిపత్యం చూస్తూ పెరిగాను. విరాట్‌ చేతుల మీదుగా నేను నా టెస్ట్‌ క్యాప్‌ అందుకోబోతున్నా అని తెలిసి నేను ఆనందంతో


ఉబ్బితబ్బిబ్బయ్యాను. క్యాప్ నంబర్ 315, నితీష్ రెడ్డి.. ఈ మాటలు నా హృదయంలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి. టెస్ట్ క్రికెట్లో మీరు నిజమైన టార్చ్ బేరర్. నీతో మైదానంలో కలిసి పంచుకున్న క్షణాలను నేను


ఎల్లప్పుడూ విలువైనవిగా భావిస్తాను’ - నితీశ్‌ కుమార్‌ రెడ్డి  ‘నువ్వు హృదయంతో ఆడావు’ ‘అద్భుతంగా టెస్ట్‌ కెరీర్‌ను సాగించిన విరాట్‌ కోహ్లీకి అభినందనలు. టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న సమయంలో


స్వచ్ఛమైన టెస్ట్‌ ఫార్మాట్‌లో నువ్వు చక్కటి నిబద్ధత, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ చాటావు.  లార్డ్స్‌లో నీ ప్రసంగం అంతా చెప్పింది. నువ్వు టెస్ట్‌ మ్యాచ్‌లను హృదయంతో, దృఢ సంకల్పంతో ఆడావు’ - ఐసీసీ


అధ్యక్షుడు జై షా


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్‌ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Latests News

Virat kohli: నిన్ను మిస్సవుతున్నా.. కోహ్లీ రిటైర్మెంట్‌పై గంభీర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC).. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) రిటైర్‌మెంట్‌ నిర్ణయంపై స్పందించాయి. టెస్...

Akhilesh yadav: కుమార్తె పేరిట నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా.. 24గంటలైనా చర్యల్లేవంటూ మాజీ సీఎం ట్వీట్‌

తన కుమార్తె పేరిట దుండగులు నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా తెరిచారని, దాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార...

10 potret thitipoom techaapaikhun, aktor muda thailand yang kece abis

Thitipoom Techaapaikhun atau lebih dikenal dengan nama New Thitipoom merupakan aktor muda Thailand yang sedang naik daun...

Russia drone attacks: ఉక్రెయిన్‌పైకి వందలాది డ్రోన్లు.. రష్యా అతిపెద్ద దాడులు

ఇంటర్నెట్‌ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా (Ukraine Russia Conflict) మరోసారి విరుచుకుపడింది. రాత్రికి రాత్రే ఏకంగా వందలాది డ్...

Karimnagar | latest news on karimnagar district - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Top