Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం

Eenadu

Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం"

Play all audios:

Loading...

ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత సైన్యం పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా నాశనం చేసింది. ఇందులో భాగంగా భారతసైన్యం చూపిన తెగువ, ధైర్యసాహసాలను కీర్తిస్తూ


బీసీసీఐ ధర్మశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని


ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల నిర్మూలనలో భారతసైన్యం చూపిన తెగువ, ధైర్యసాహసాలను కీర్తిస్తూ... సంఘీభావం తెలపాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. ఇవాళ ధర్మశాల వేదికగా


పంజాబ్ కింగ్స్ (Punjab Kings), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.  ప్రముఖ గాయకుడు బి ప్రాక్‌ (ప్రతీక్‌


బచన్‌) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా భారత సైనికులకు గౌరవ సూచకంగా దేశభక్తి గీతాలను ఆలపించనున్నారు. మే 7న ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata


Knight Riders), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భారత సైన్యానికి మద్దతుగా జాతీయ గీతాలాపన చేశారు.


Trending News

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మినీ మహానాడు వేడుకలు

ఫ్రాంక్‌ఫర్ట్‌: జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌లో మినీ మహానాడు వేడుకలు విజయవంతమైనట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష, మిర్చియార్డ్ మాజీ ...

Latests News

Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం

ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత సైన్యం పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా నాశనం చేస...

Ashwini vaishnaw: ఉగ్రవాద కట్టడి పుస్తకాన్ని భారత్‌ పునర్‌ లిఖిస్తోంది: కేంద్ర మంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ హర్షం వ్యక్తంచేశ...

పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ ఏడాది ...

Golden dome: అమెరికా రక్షణకు బంగారు కవచం.. ఏమిటీ గోల్డెన్‌ డోమ్‌..?

Golden Dome| ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌ ప్రయోగించిన వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్‌ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన వ్యవస్...

Ranya rao: గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. రన్యారావుకు బెయిల్‌ వచ్చినా జైల్లోనే

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసులో (Gold Smuggling Case) అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) స్పెషల్‌ న్యాయస్థా...

Top