Upcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఆ ఒక్కటీ ప్రత్యేకం..
Upcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఆ ఒక్కటీ ప్రత్యేకం.."
Play all audios:
కథా బలమున్న చిత్రం ‘లెవెన్’ ‘నేను చేసే కథలు, పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదటినుంచి ప్రశంసిస్తున్నారు. ఆ గౌరవానికి బదులుగా ఈ ‘లెవెన్’ (Eleven movie) చిత్రాన్ని అందిస్తున్నా. ఇప్పటివరకు
ఏ థ్రిల్లర్‌లోనూ చూడని ఓ వినూత్నమైన కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది’ అంటున్నారు నవీన్ చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రమిది. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. రియా కథానాయిక. ఈనెల 16న
తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ------------------------- కామెడీ హారర్‌తో.. తమిళ కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్’. కామెడీ హారర్
జానర్‌లో రూపొందిన ఈ చిత్రం మే 16న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 2023లో వచ్చిన ‘డీడీ రిటర్న్స్’కు కొనసాగింపుగా దర్శకుడు ఎస్.ప్రేమ్ ఆనంద్ దీన్ని తీర్చిదిద్దారు. గీతిక తివారి,
సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ------------------------- చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా ‘థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకొని సాంకేతికంగా బలంగా
ఉండాలని చేసిన సినిమా ‘23’. థియేటర్‌లో చూసి అనుభూతి చెందాల్సిన చిత్రమిది’ అంటున్నారు దర్శకుడు రాజ్.ఆర్. తేజ, తన్మయి జంటగా నటించారు. స్టూడియో 99 నిర్మించగా, స్పిరిట్ మీడియా విడుదల
చేస్తోంది. ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ------------------------- యాక్షన్ ప్రియులను అలరించేందుకు.. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం
‘మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible The final Reckoning). స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో క్రిస్టోఫర్ మేక్‌క్వారీ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు
పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 17న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్న ‘ఎన్‌టీటీ’ను ఈథన్ హంట్ ఎలా అడ్డుకున్నాడు? ఈ
క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు.. * నెట్‌ఫ్లిక్స్ * సీ4 సింటా (తమిళ) మే 12 * ది రిజర్వ్ (వెబ్‌సిరీస్) మే 15 * అమెజాన్
ప్రైమ్ * ఓవర్ కాంపన్సేటింగ్ (వెబ్‌సిరీస్) మే 15 * భూల్ చుక్ మాఫ్ (హిందీ) మే 16 * జియో హాట్‌స్టార్ * హై జునూన్ (హిందీ సిరీస్) మే 16 * ఈటీవీ విన్ * అనగనగా (తెలుగు) మే 15 * సోనీలివ్
* మరనమాస్ (మలయాళం) మే 15 * సన్‌నెక్ట్స్ * నెసిప్పాయా (తమిళ) మే 17
Trending News
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
Game changer: ‘గేమ్‌ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్ షెడ్యూలు విడుదలస్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...
Latests News
Icici lombard: మోటార్ ఇన్సూరెన్స్ లో ఐసీఐసీఐ కొత్త పాలసీ.. దీంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?Published by: Last Updated:July 28, 2022 2:22 PM IST ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్(IC...
Panileni Puliraju Movie User Reviews & Ratings | Panileni Puliraju (2016) | Times Of India‘The White Lotus’ stars defend incest-like twist: “Nothing here is purely for shock value...”Peppa Pig and George to get...
Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?Published by: Last Updated:December 16, 2024 7:26 PM IST MANCHU MANOJ: ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్...
Ajith: సినిమా, రేసింగ్.. రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నా.. అందుకే కీలక నిర్ణయం: అజిత్‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly)తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు స్టార్ హీరో అజిత్ (Ajith). తాజాగా ఆయన ఓ ఆసక్తికర ...
National news | latest national news - eenaduINDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...