Ajith: సినిమా, రేసింగ్‌.. రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నా.. అందుకే కీలక నిర్ణయం: అజిత్‌

Eenadu

Ajith: సినిమా, రేసింగ్‌.. రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నా.. అందుకే కీలక నిర్ణయం: అజిత్‌"

Play all audios:

Loading...

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly)తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు స్టార్‌ హీరో అజిత్‌ (Ajith). తాజాగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఇంటర్నెట్‌డెస్క్‌: ఓవైపు సినిమాలు.. మరోవైపు


కారు రేసులతో ఫుల్‌ బిజీగా సమయాన్ని గడుపుతున్నారు అగ్ర నటుడు అజిత్‌ (Ajith). ఆయన హీరోగా నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (good bad ugly) ఇటీవల విడుదలై అభిమానులను అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో


పాల్గొన్న అజిత్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడారు. అంతేకాకుండా, రేసింగ్‌లో పాల్గొనడం పైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా, రేసింగ్‌.. ఈ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నానని


తనకు అర్థమైందన్నారు. అందుకే తాను, రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ‘‘రేసింగ్‌ అంటే నాకెంతో ఇష్టం. రేసింగ్‌కు ఫిట్‌నెస్‌ ఎంతో అవసరం. చాలా


రోజుల తర్వాత కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలని అర్థమైంది. స్విమ్మింగ్‌, సైక్లింగ్‌తోపాటు ఇతర వర్కౌట్లు, డైట్‌ చేశా. గత ఎనిమిది నెలల కాలంలో సుమారు 42 కిలోల బరువు


తగ్గా. రేసింగ్‌ - సినిమా ఒకే సమయంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నా. దానివల్ల ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని


నిర్ణయించుకున్నా. రేసింగ్‌ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నిజం చెప్పాలంటే, నా సినిమాల్లో స్టంట్స్‌ నేనే చేస్తా. దానివల్ల నాకెన్నో సర్జరీలు జరిగాయి. అలా అని, యాక్షన్‌ సినిమాలు


వదిలేయలేను కదా. అదేవిధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌కు దూరం కాలేను. నా దృష్టిలో ఈ రెండూ ఒకే లాంటివి’’ అని అజిత్‌ వివరించారు. తన తదుపరి ప్రాజెక్ట్‌ నవంబర్‌లో మొదలుకానుందని చెప్పారు. వచ్చే


ఏడాది వేసవికి దానిని విడుదల చేస్తామని తెలిపారు. * మా నాన్న సంతోషమే నాకు ముఖ్యం: మంచు విష్ణు ఇటీవల అజిత్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. రేసింగ్‌ విషయానికి వస్తే.. జనవరిలో జరిగిన


24హెచ్‌ దుబాయ్‌ కారు రేసింగ్‌లో అజిత్‌ పాల్గొన్నారు. ఆ పోటీల్లో అజిత్‌ టీమ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటలీలో జరిగిన 12హెచ్‌ రేస్‌లోనూ మూడో స్థానం దక్కించుకుంది. బెల్జియంలో


నిర్వహించిన స్పా- ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్‌ సర్క్యూట్‌లో ఆయన టీమ్‌ ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


Trending News

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Latests News

Ajith: సినిమా, రేసింగ్‌.. రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నా.. అందుకే కీలక నిర్ణయం: అజిత్‌

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly)తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు స్టార్‌ హీరో అజిత్‌ (Ajith). తాజాగా ఆయన ఓ ఆసక్తికర ...

National news | latest national news - eenadu

INDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్‌ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Csk vs rcb: మీ ఆటతీరు అవుట్‌డేటెడ్‌ అయిందా? విలేఖరి ప్రశ్నకు ఫ్లెమింగ్ అసహనం

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి సీజన్‌ (2008) తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్‌ వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (CSK vs ...

Perenti offloads canning vale lab business for $75. 7m

Stuart McKinnonThe West Australian Perenti has netted $75.7 million from the sale of its minerals analysis business and ...

Top