Trivikram: సిరివెన్నెల పాటల్లో అలాంటివి 3 వేలు: త్రివిక్రమ్‌

Eenadu

Trivikram: సిరివెన్నెల పాటల్లో అలాంటివి 3 వేలు: త్రివిక్రమ్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్: సినిమాలో మాటలు రాయడం కంటే పాటలు రాయడమే కష్టమన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ చివరి ఎపిసోడ్‌కు (Naa Uchvasam Kavanam) అతిథిగా హాజరైన ఆయన (Trivikram


Srinivas).. సిరివెన్నెల సీతారామశాస్త్రితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ‘‘దర్శక నిర్మాతలు ఆలోచించినట్లు కాకుండా సిరివెన్నెల అంతకు మించి ఆలోచిస్తారు. ఆయన రాసిన పాట ఎన్ని ఏళ్లు అయినా కూడా


అందరికీ గుర్తుండాలి అని అనుకుంటారు. ‘పట్టుదల’లోని ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాట.. ఇప్పటికీ సినిమాతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతోంది. ‘జల్సా’లోని ‘చలోరే చలోరే..’ పాట గురించి 20 రోజులకు


పైగా చర్చించుకున్నాం. డిస్కర్షన్స్‌ అయిపోయిన వెంటనే రాసేశారు. ఎన్ని రోజులు చర్చించుకున్నామో అంత త్వరగా రాసిన పాట అది. ఆ పాటను 34 పేజీలు రాశారు. మేం రెండు పేజీలు కూడా వాడలేదు’’ ‘‘ఎన్నో భక్తి


పాటలు రాసిన అతిపెద్ద నాస్తికుడు సీతారామశాస్త్రి (sirivennela seetharama sastry). ఒకసారి నాకు, శాస్త్రి గారికి మధ్య దేవుడు ఉన్నాడా, లేడా అనే చర్చ జరిగింది. దేవుడు ఉంటే ఇన్ని అన్యాయాలు ఎందుకు


జరుగుతున్నాయి అని అడిగాను. ‘అనవసరమైన విషయాల్లోకి భగవంతుడిని లాగొద్దు’ అని చెప్పారు. దేవుడిని బాగా నమ్మిన తర్వాత ఆయనతో స్నేహం చేసే స్థాయికి వెళ్తాం. ఆయన దేవుడితో అలానే స్నేహం చేశారు. ఆయన


రాసిన ఎన్నో పాటల్లో లిరిక్స్‌ దేవుడితో గొడవ పెట్టుకున్నట్లు ఉంటాయి. మనమందరం గుడిలో క్యూలో ఉన్నాం. ఆయన లాంటి వారంతా గర్భగుడి దాకా వెళ్లారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో జరుగుతున్నదీ జగన్నాటకం


అనే గొప్ప పాట రాశారు. అది నాకు చాలా ఇష్టం’’ * అలా సిరివెన్నెలే రాయగలరు.. ఆయన పాటతో గాయకుడిగా పరిచయమయ్యా: చంద్రబోస్‌ ‘‘సిరివెన్నెల ఎలాంటి సన్నివేశాలకైనా పాటలు రాయగలరు. అలా రాయడం చాలా కష్టం.


నేను ఆరు పాటలు రాశాను. నాకు తెలియకుండానే ఆరో పాటలో మొదటి దానిలో వాడిన పదాలు వచ్చేశాయి. దీన్నిబట్టి వేల పాటలు రాయడం ఎంత కష్టమో మీరే అర్థం చేసుకోవాలి. సిరివెన్నెల రాసిన పాటలు సినిమాల్లో


వాడనివి కనీసం 2,3 వేలు ఉండి ఉంటాయి. వాటిని ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. వాటిని బయటకు తీసుకువస్తే.. భవిష్యత్తులో పాటలు రాయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడతాయి. ఆయన ప్రతి పాటను


రెండు విధాలుగా రాశారు. అది అందరూ తెలుసుకోవాలి’’ అని త్రివిక్రమ్‌ అన్నారు. ‘‘భారతీయ సినిమాలో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. ఏది చెప్పాలన్నా సంగీతాన్నే ఉపయోగిస్తాం. శాస్త్రిగారు


సిగరెట్స్‌ ఎందుకు తాగుతారు అని వాళ్ల భార్య నన్ను అడిగారు. ‘మా అందరి మూర్ఖత్వాన్ని భరించడం కోసమే’ అని చెప్పాను. ఆయన పాటల ద్వారా మనకు సంతోషాన్నివ్వడం కోసం చాలా కష్టపడ్డారు. సినిమాలో మాటలు


రాయడం కంటే పాటలు రాయడమే కష్టం. సిరివెన్నెల అందరికీ అందుబాటులో ఉండే శిఖరం. సాధారణంగా శిఖరాన్ని దూరం నుంచి చూస్తాం. కానీ.. సిరివెన్నెల అనే శిఖరం.. అందరికీ అందుబాటులో ఉంటూ ఎందరికో దారి చూపింది.


ఆయన ఏం చేసినా పరిపూర్ణంగా చేశారు’’ అంటూ త్రివిక్రమ్‌ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల


సీతారామశాస్త్రి. ఆయన రాసిన పాట గొప్పతనాన్ని, సాహిత్యాన్ని భావితరాలకు అందించే కృషిలో భాగంగా నిర్వహించిన ‘నా ఉచ్ఛ్వాసం కవనం..!’ కార్యక్రమం ఈ ఎపిసోడ్‌తో ముగిసింది. త్వరలోనే మరో సిరీస్‌తో


రానున్నట్లు వ్యాఖ్యత పార్థు నేమాని తెలిపారు. 52 ఆదివారాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో నాగార్జున, ప్రభాస్, తనికెళ్ల భరణి, మణిరత్నం, రాజమౌళి, కృష్ణ వంశీ, క్రిష్‌ జాగర్లమూడి, రామజోగయ్య శాస్త్రి,


చంద్రబోస్‌, ఆర్పీ పట్నాయక్‌, త్రివిక్రమ్‌ లాంటి ఎందరో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Latests News

Trivikram: సిరివెన్నెల పాటల్లో అలాంటివి 3 వేలు: త్రివిక్రమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: సినిమాలో మాటలు రాయడం కంటే పాటలు రాయడమే కష్టమన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ చివరి ఎ...

Roya Ijadi-Maghsoodi – The Conversation

Dr. Roya Ijadi-Maghsoodi is an Assistant Professor-in-Residence in the UCLA Department of Psychiatry and Biobehavioral S...

Game changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నిడివి 5 గంటలు.. కానీ: డైరెక్టర్‌ శంకర్‌ వైరల్‌ కామెంట్స్‌

‘గేమ్‌ ఛేంజర్‌’కు తాను అనుకున్న నిడివి 5 గంటలు అని శంకర్‌ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఇంట...

Prabhas: ‘యానిమల్‌’ ట్రైలర్‌పై ప్రభాస్‌ రివ్యూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

రణ్‌బీర్ కపూర్‌-రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ను ప్రముఖులు ప్రశ...

Ttd inaugurates srivari model temple in prayagraj ahead of maha kumbh mela

TIRUMALA: Tirumala Tirupati Devasthanams (TTD) inaugurated the Srivari model temple in Prayagraj of Uttar Pradesh on Sun...

Top