Niharika: టామ్‌ క్రూజ్‌తో నిహారిక.. వీడియో వైరల్‌

Eenadu

Niharika: టామ్‌ క్రూజ్‌తో నిహారిక.. వీడియో వైరల్‌"

Play all audios:

Loading...

హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ (Tom Cruise)ను సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, నటి నిహారిక (Niharika NM) కలిశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌డెస్క్‌:


హాలీవుడ్‌ ప్రముఖ నటుడు టామ్‌ క్రూజ్‌ (Tom Cruise)ను సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, నటి నిహారిక (Niharika NM) కలిశారు. టామ్‌ క్రూజ్ నటించిన ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ద ఫైనల్‌ రెకనింగ్‌’ (Mission


Impossible The final Reckoning) సినిమా ప్రీమియర్‌ యూకేలో జరిగింది. తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన సోషల్‌మీడియా తారలను ఈ ప్రీమియర్‌ షోకు టీమ్ ఆహ్వానించింది. ఇందులో


పాల్గొన్న నిహారిక.. టామ్‌ క్రూజ్‌తో ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా యాక్షన్‌ ప్రియులు ఎంతగానో


అభిమానించే టామ్‌ క్రూజ్‌ను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇది నిజమేనని నమ్మడానికి చాలా సమయం పట్టేలా ఉందని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతేకాకుండా.. కలలో కూడా తాను ఇలాంటిది ఊహించలేదంటూ తన


ఆనందాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు.. ‘‘నువ్వు సూపర్‌ లక్కీ’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. * చిరంజీవి - అనిల్‌


రావిపూడి చిత్రం.. హీరోయిన్‌గా ఆమే ఫిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ‘మిషన్‌ ఇంపాసిబుల్‌’ ఫ్రాంఛైజీల్లో భాగంగా రూపొందిన ఎనిమిదో చిత్రమిది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌


నేపథ్యంలో క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ దీనిని రూపొందించారు. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టామ్‌ క్రూజ్‌ కేన్స్‌ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ‘మిషన్‌


ఇంపాసిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ (Mission: Impossible The Final Reckoning)ను కేన్స్‌లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌ ముగిసిన తర్వాత ప్రేక్షకులు ఐదు నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టడం


విశేషం. దీంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ ఫ్రాంఛైజీలో నన్ను భాగం చేసినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. నా దశాబ్దాల ప్రయాణంలో నేను వేసిన ప్రతి


అడుగుకు మీరు సహకరించారు. ఈరోజు ఇక్కడ కేన్స్‌లో ఇలాంటి అద్భుతమైన క్షణాలు గడుపుతానని కలలో కూడా ఊహించలేదు’’ అని అన్నారు. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న నిహారిక ప్రస్తుతం


సినిమాల్లోనూ యాక్ట్‌ చేస్తున్నారు. ఆమె నటించిన ‘పెరుసు’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించింది.


Trending News

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆ ప్రచారం ఫేక్‌

శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. తిరు...

Sheikh hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానిపై మరో నేరాభియోగం నమోదు..

Sheikh Hasina ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు ...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్లు ఇవే

Lava Shark 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Latests News

Niharika: టామ్‌ క్రూజ్‌తో నిహారిక.. వీడియో వైరల్‌

హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ (Tom Cruise)ను సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, నటి నిహారిక (Niharika NM) కలిశారు. దీనికి సం...

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌.. మృతుల్లో ఎంపీ సోదరి

రాంనగర్‌ (అనంతపురం): ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. వీరిలో ఇద్దరు ఏపీ వాసులు...

Trivikram: నేను పొగడలేదు.. కోప్పడ్డా: సిరివెన్నెలపై స్పీచ్‌ గురించి త్రివిక్రమ్‌

సిరివెన్నెలను ఉద్దేశించి గతంలో తాను ఇచ్చిన ప్రసంగంపై దర్శకుడు త్రివిక్రమ్‌ స్పందించారు. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమంలో...

Earthquake: ఢిల్లీని వణికించిన భూకంపం.. అర్ధరాత్రి జనం పరుగులు.. నేపాల్‌లో పలువురు మృతి

Published by: Last Updated:November 09, 2022 6:11 AM IST నేపాల్‌ (NEPAL EARTHQUAKE)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ ర...

ఆవిరైపోతున్న అస్తిత్వాలు

మాలర్డ్‌. అమెరికా దక్షిణాదిలో మాప్‌లో దొరకని ఒక కాల్పనిక గ్రామం. అక్కడున్న నల్లవాళ్లంతా తెల్లవాళ్లుగా చలామణీ కాగలిగినంత ...

Top