Operation sindoor: మమ్మల్ని సంప్రదించకుండానే అఖిలపక్షంలో యూసఫ్ పఠాన్ పేరు: తృణమూల్
Operation sindoor: మమ్మల్ని సంప్రదించకుండానే అఖిలపక్షంలో యూసఫ్ పఠాన్ పేరు: తృణమూల్"
Play all audios:
పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు భారత్ తరఫున విదేశాలకు వెళ్తున్న దౌత్యబృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్ తప్పుకున్నారు. ఇంటర్నెట్‌డెస్క్: ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై
విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఏడు బృందాలు విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ యూసఫ్ పఠాన్ (Yusuf
Pathan) తప్పుకున్నారు. తమను సంప్రదించకుండానే పఠాన్ ఎంపిక జరిగిందంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్రంపై విమర్శలు చేశారు. పాక్‌ను ఎండగట్టే దౌత్యబృందంలో కేంద్రం అన్ని
పార్టీల సభ్యులకు చోటు కల్పించింది. అందులో టీఎంసీ పార్టీ నుంచి బహంపుర్‌కు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూసఫ్ పఠాన్‌ను ఎంపిక చేసింది. అయితే, ఈ ఎంపికను టీఎంసీ తప్పుబట్టింది. తమను
సంప్రదించకుండా పఠాన్‌ను దౌత్యబృందంలో చేర్చడం సమంజసం కాదని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలని కేంద్రానికి సూచించారు. అంతేకాక..
కేంద్రం నిర్ణయించిన దౌత్య బృందం పర్యటనకు పఠాన్ వెళ్లడం లేదని స్పష్టంచేశారు. * శశిథరూర్‌పై వేటు వేద్దామా.. వద్దా ?భాజపా అస్త్రంతో ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్..! పహల్గాం ఘటన నేపథ్యంలో
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ దౌత్యయుద్ధం ప్రారంభించింది. ఇందులోభాగంగా మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో
పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత గానీ, అధికారి గానీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 51
మందిలో 31 మంది ఎన్డీయే నేతలు, 20 మంది ఎన్డీయేతర పార్టీల నేతలున్నారు. ‘ఒకే లక్ష్యం.. ఒకే సందేశం.. ఒకే భారత్’ పేరుతో ఈ పర్యటనలు సాగనున్నాయి.
Trending News
Paritala sunitha | latest paritala sunitha - eenaduజగన్.. గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టొద్దు: పరిటాల సునీత తన భర్త, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో వైకాపా అధ్యక్ష...
Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలుఅమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...
Stock market: భారత్-పాక్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: సెన్సెక్స్ 880 పాయింట్లు డౌన్.. మళ్లీ 80 వేల దిగువకుStock market | ముంబయి: భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్ర...
గ్రేటర్‌లో కరోనా విజృంభణ: కీలక నిర్ణయంసాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరు...
American citizenship: వలసదారులతో రియాలిటీ షో.. ప్రైజ్‌మనీ పౌరసత్వం(వలసదారుల ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ...
Latests News
Operation sindoor: మమ్మల్ని సంప్రదించకుండానే అఖిలపక్షంలో యూసఫ్ పఠాన్ పేరు: తృణమూల్పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు భారత్ తరఫున విదేశాలకు వెళ్తున్న దౌత్యబృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్...
Venkatesh | latest venkatesh - eenaduసరదాల గోదారి..! ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాం...
Pakistan: మా ప్రధానే పిరికివాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం..? : పాకిస్థాన్ ఎంపీఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన భారత్.. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస...
India-un: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి: ఐరాసలో భారత్ ప్రయత్నాలుఇంటర్నెట్డెస్క్: పహల్గాం ఉగ్ర దాడితో దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ మారణహోమానికి తామే బాధ్యులమని లష్కరే తయ్యిబా అ...
Top ten news @ 9 am: ఈనాడు. నెట్‌లో టాప్ 10 వార్తలు @ 9 am (feb 02)1. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం.. జిల్లాలవారీగా వర్క్ స్టేషన్లు కడప: ‘ఇక్కడ ఎవరైనా ఐటీ ఉద్యోగులున్నారా?’ అని ప్రజావేదిక న...