Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు

Eenadu

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు"

Play all audios:

Loading...

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇప్పటి

వరకు ఆరు ఎస్‌ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఒప్పందాలు చేసుకున్న

సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ జరగాలన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్‌ఐపీబీ సమావేశం ముగిసింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33వేల కోట్ల పెట్టుబడుల

ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు సమావేశంలో ఆమోదం లభించింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు

పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకువచ్చాయి.రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు సంబంధించి... ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర

పర్యవేక్షణ జరపాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్‌ చేయాలన్నారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్‌ బోర్డు తీసుకురావాలని

అధికారులను ఆదేశింంచారు. టూరిజం సెక్టార్‌లో హోటళ్లు, గదుల కొరత ఉందన్న ముఖ్యమంత్రి.. పెద్దఎత్తున హొటల్ రూమ్‌లు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందని వ్యాఖ్యానించారు. 50 వేల రూమ్‌లు అందుబాటులోకి

తేవాలి అనేది తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. హోటల్ రూమ్‌ల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని వెల్లడించారు.

Trending News

Paritala sunitha | latest paritala sunitha - eenadu

జగన్‌.. గ్రామాల్లో ఫ్యాక్షన్‌ చిచ్చు పెట్టొద్దు: పరిటాల సునీత తన భర్త, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో వైకాపా అధ్యక్ష...

Priyanka gandhi | latest priyanka gandhi - eenadu

మదర్‌ థెరెసాతో కలసి పనిచేశా: ప్రియాంక గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ పోలికలతో... నేత చీరల్లో అందంగా హుందాగా కనిపిస్తుంది ప్రి...

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...

Latests News

Top