American citizenship: వలసదారులతో రియాలిటీ షో.. ప్రైజ్‌మనీ పౌరసత్వం
American citizenship: వలసదారులతో రియాలిటీ షో.. ప్రైజ్‌మనీ పౌరసత్వం"
Play all audios:
(వలసదారుల ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే అలాంటివారు అమెరికా
పౌరసత్వం పొందడానికి ప్రభుత్వం ఓ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది (American citizenship). అందుకోసం ఎన్నడూ లేనివిధంగా ఓ రియాలిటీ షో ఏర్పాటుచేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశం
పరిశీలనలో ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(DHS) వెల్లడించింది. ‘‘పరిశీలన దశలో ఉన్న ఈ ప్రతిపాదన ఇంకా ఆమోదం కానీ, తిరస్కరణ కానీ పొందలేదు. ఇప్పటివరకు ఉన్న విధివిధానాలను దాటి
వ్యవహరించాలనుకుంటున్నాం’’ అని ప్రజావ్యవహారాల విభాగం వెల్లడించింది. ఈ ప్రతిపాదిత షోలో పోటీదారులు అమెరికాపై తమ దేశభక్తిని చాటుకునేలా పోటీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ పోటీలో పాల్గొనే వలసదారులు
గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ వంటి టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందని సమాచారం. ‘‘ఇది వలసదారులను ఉద్దేశించి నిర్వహించే హంగర్ గేమ్ కాదు’’ అని అధికారులు వెల్లడించారు. * లిబియాకు 10 లక్షల మంది
పాలస్తీనియన్ల తరలింపు.. ట్రంప్ వ్యూహం! ఎల్లిస్ ఐలాండ్‌లో ప్రారంభం కానున్న ఈ షోలో ఎపిసోడ్‌కు ఒకరిని చొప్పున ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. విజయం సాధించిన వారికి అమెరికా పౌరసత్వం లభించే అవకాశం
ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం వివిధ వర్గాలకు చెందిన వలసదారులకు తాత్కాలిక రక్షణ హోదా (TPS)ను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ షో గురించి వార్తలు వస్తున్నాయి. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు,
ఇతర అసాధారణ పరిస్థితుల వల్ల సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్లలేని విదేశీ పౌరుల కోసం టీపీఎస్ మంజూరుచేస్తుంటారు. ఇదిలాఉంటే.. ఈ వార్తల వేళ అత్యంత ప్రజాదరణ పొందిన స్క్విడ్‌గేమ్ సిరీస్
గుర్తుకువస్తోంది. జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్ గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు
నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. చివరగా వచ్చే ఆట పేరే ‘స్క్విడ్ గేమ్’. ఇప్పటికే రెండు సీజన్‌లు ప్రేక్షకాదరణను సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో సీజన్ వచ్చేస్తోంది.
Trending News
Ktr: హరీశ్‌రావుతో కేటీఆర్ భేటీ.. తాజా పరిణామాలపై సుదీర్ఘ చర్చహైదరాబాద్: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అనార...
Saraswati river pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు.. మీకివి తెలుసా?ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈ నెల 26 వరకు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ...
Pm modi: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయమంటూ మోదీ పోస్ట్దిల్లీ: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృ...
Hydra: కూకట్‌పల్లిలో ఆక్రమణలను కూల్చేసిన హైడ్రా.. ప్లాట్ల యజమానుల హర్షంకూకట్పల్లి హైదర్‌నగర్ డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌ను ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా (Hydra) విడిపించింది. ఇక్కడ ప్లాట్లను కొన...
Bsf jawan: భారత బీఎస్‌ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్..BSF jawan | ఇంటర్నెట్‌డెస్క్: పాక్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్ వద్ద అదుపులోకి తీసుకొన్న బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణమ్ సా...
Latests News
American citizenship: వలసదారులతో రియాలిటీ షో.. ప్రైజ్‌మనీ పౌరసత్వం(వలసదారుల ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ...
టిప్పు సుల్తాన్: బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే... - bbc news తెలుగుటిప్పు సుల్తాన్: బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే... కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీ...
Samantha | latest samantha - eenaduతీరిక దొరికితే... టూరే! పుస్తకాలు చదివినా, ప్రయాణించినా ప్రపంచం తెలుస్తుందని అంటారు. అందుకేనేమో చాలామంది తారలు పుస్తకాల ...
Anasuya bharadwaj | latest anasuya bharadwaj - eenaduVIMANAM MOVIE REVIEW: రివ్యూ: విమానం.. సముద్రఖని, అనసూయల చిత్రం ఎలా ఉంది? Vimanam Movie Review: సముద్రఖని, అనసూయ, రాహుల్...
Konda surekha | latest konda surekha - eenaduచేసిన తప్పులను గత పాలకులు ఇప్పటికీ గ్రహించట్లేదు: తెలంగాణ మంత్రులు గతంలో ధరణి పేరిట ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు చేశారని ...