Paradip: నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది.. ఆ పోర్టులో హైఅలర్ట్‌

Eenadu

Paradip: నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది.. ఆ పోర్టులో హైఅలర్ట్‌"

Play all audios:

Loading...

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఒడిశాలోని పరదీప్‌


పోర్టు(Paradip port)కు వచ్చిన ఓ షిప్‌ కలకలం రేపింది. అందులో 21 మంది పాకిస్థాన్‌ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించడమే అందుకు కారణం. దీంతో ఆ పోర్టులో భద్రతను  పెంచారు. ఆ ప్రాంతంలో


హైఅలర్ట్‌ ప్రకటించారు. బుధవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్‌ మీదుగా ఓ నౌక పరదీప్‌ పోర్టుకు చేరింది. ‘ఎమ్‌టీ సైరెన్‌ II’ పేరుతో ఉన్న ఈ షిప్‌లో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇది


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టగా సిబ్బందిలో 21 మందిని పాకిస్థానీయులుగా గుర్తించారు. * ఉద్రిక్తతలు తగ్గాలంటే భారత్‌-పాకిస్థాన్‌ కలిసి


డిన్నర్‌ చేయాలి.. ట్రంప్‌ నోట మళ్లీ అదే పాట ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి దీనిగురించి సమాచారం అందడంతో వెంటనే ఒడిశా మెరైన్‌ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోర్టులో


భద్రతను మరింత పెంచినట్లు మెరైన్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బబితా దుహేరి తెలిపారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించి పరిస్థితిని


సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కి.మీ. దూరంలోని ‘పీఎం బెర్త్‌’ వద్ద లంగర్‌ వేసి ఉంది. ఇందులో 11,350 మెట్రిక్‌ టన్నుల ముడి చమురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముడి చమురు


అన్‌లోడింగ్‌ పూర్తయ్యే వరకూ 25 మంది సిబ్బంది నౌకను వీడకుండా భద్రతా ఏర్పాట్లుచేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.


Trending News

Ed raids siddartha institutions linked to karnataka hm parameshwara

BENGALURU: The Directorate of Enforcement (ED) on Wednesday reportedly raided the premises of educational institutions b...

Ajay bhupathi: rx100 దర్శకుడికి గొల్డెన్ ఛాన్స్... ఏకంగా ఆ స్టార్ హీరో కొడుకుతో పాన్ ఇండియా సినిమా..!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...

Cbse results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌..

CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుక...

గ్రేటర్‌లో కరోనా విజృంభణ: కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరు...

Latests News

Paradip: నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది.. ఆ పోర్టులో హైఅలర్ట్‌

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భ...

Weight loss: అధిక బరువును తగ్గించుకోవాలంటే ఈ ఒక్కటి ఆహారంలో ఉంచితే బెటర్​..

Published by: Last Updated:August 28, 2021 9:23 PM IST ఉపవాస సమయంలో మఖానా ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఉపవాసం సమయంలో తినే ...

సుశాంత్‌ ఆత్మహత్య : ఫేక్‌ సంతాపాలు అవసరమా?

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి నకిలీ సంతాపాలు తెలుపుతున్నారంటూ నటి స్వస్తిక ముఖర్జీ ఆగ్రహ...

Insurance | latest insurance - eenadu

తల్లిదండ్రులు, అత్తమామలకు ఆరోగ్య బీమా రక్షణ మీ భార్య, పిల్లలతోపాటు తల్లిదండ్రులు, అత్తమామలను కూడా కలుపుకుని ఆరోగ్య బీమా ...

Photo gallery | latest photo gallery - eenadu

ఫ్యామిలీ ఫొటోకి... డైమండ్స్‌ అందం! పెళ్లిలో ఏడడుగులు వేసిన మధుర క్షణాలు... పసిపిల్లల బోసినవ్వులు... కుటుంబమంతా కలిసి సంత...

Top