S jaishankar: చరిత్రలో తొలిసారి.. తాలిబన్ మంత్రితో జైశంకర్‌ చర్చలు

Eenadu

S jaishankar: చరిత్రలో తొలిసారి.. తాలిబన్ మంత్రితో జైశంకర్‌ చర్చలు"

Play all audios:

Loading...

దిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో.. భారత విదేశీ


వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్‌ స్వాగతించారు. ఈవిషయాన్ని కేంద్రమంత్రి ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.


తాలిబన్‌ (Taliban) ప్రభుత్వంతో న్యూదిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ‘‘అఫ్గాన్‌ (Afghanistan) తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్‌తో మంచి సంభాషణ జరిగింది.


పహల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించడం హర్షణీయం. భారత్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవ, నిరాధార ప్రచారం జరిగింది. దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా. అఫ్గాన్‌


ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధికి నిరంతర మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై మేం చర్చలు జరిపాం’’ అని జైశంకర్‌ తన


పోస్ట్‌లో రాసుకొచ్చారు. * ఐరన్‌డోమ్‌ లాంటి ‘ఆకాశ్‌’.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది! ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్‌ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే.


అయితే, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పాక్‌ సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌ ప్రయోగించిన ఓ క్షిపణి అఫ్గాన్‌ భూభాగంలో పడినట్లు తప్పుడు ప్రచారం చేసింది. దీన్ని కాబూల్‌ ఖండించింది. తమకు ఎలాంటి హాని


జరగలేదని, అదంతా అవాస్తవమేనని తాలిబన్‌ రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. అటు న్యూదిల్లీ కూడా పాక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టింది. 2021 ఆగస్టులో అఫ్గాన్‌లో తాలిబన్‌ పాలన ఏర్పడిన సంగతి తెలిసిందే.


ఆ ప్రభుత్వాన్ని భారత్‌ అధికారికంగా గుర్తించనప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మరోవైపు, అఫ్గాన్‌లో


అల్‌ఖైదా, ఐసిస్‌, తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ వంటి ఉగ్రముఠాల ఉనికిపై న్యూదిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తాలిబన్‌ మంత్రితో జైశంకర్‌ చర్చలు జరపడం తాజా


పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.


Trending News

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Latests News

S jaishankar: చరిత్రలో తొలిసారి.. తాలిబన్ మంత్రితో జైశంకర్‌ చర్చలు

దిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వంలో తాత్క...

Army: ఆర్మీ యూనిఫామ్‌ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సాయంతో దాడులు..

ఇంటర్నెట్‌డెస్క్‌:  సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను ప...

Operation sindoor: ఉగ్రవాదాన్ని ప్రపంచం సహించకూడదు: కేంద్ర మంత్రి జైశంకర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్‌ బలగాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ ...

Ssc revised calendar: ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌ (రివైజ్డ్‌) విడుదల

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్(SSC) రివైజ్డ్‌ జాబ్‌ క్యాలెండర్‌న...

Politics: రాయలసీమలో రాజకీయ చక్రం తిప్పిన కుటుంబానికి కష్టాలు.. పరిటాల రవి ఫ్యామిలీ పోటీపై సందిగ్ధం

Published by: Last Updated:February 10, 2024 6:16 PM IST POLITICS: అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ నాయకుడు ప...

Top