Operation sindoor: ఉగ్రవాదాన్ని ప్రపంచం సహించకూడదు: కేంద్ర మంత్రి జైశంకర్‌

Eenadu

Operation sindoor: ఉగ్రవాదాన్ని ప్రపంచం సహించకూడదు: కేంద్ర మంత్రి జైశంకర్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్‌ బలగాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ పేరిట పాకిస్థాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి.


ఉగ్రవాదుల ఏరివేతకు భారత్‌ తీసుకున్న చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ (S Jaishankar) ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందిస్తూ.. ప్రపంచం ఉగ్రవాదాన్ని


ఏమాత్రం సహించకూడదని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. ప్రతిపక్షాలు సైతం భారత సైన్యం చర్యలను కొనియాడుతున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టినా తమ మద్దతు


ఉంటుందని పేర్కొన్నాయి.  -‘‘సాయుధ దళాలు తీసుకున్న చర్య ఎంతో గర్వంగా ఉంది. వారి దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని అభినందిస్తున్నాము’’  -కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  -‘‘మన సాయుధ


దళాలను చూసి గర్విస్తున్నా. భారత సైన్యానికి మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. జై హింద్‌’’ - రాహుల్‌ గాంధీ  * ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. పేరులోనే మొత్తం మెసేజ్‌..! - ‘‘పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా


ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నాం’’ - కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్ - ‘‘ఈ రోజు నా దేశం తీసుకున్న నిర్ణయంపై గర్వంగా ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా


చేస్తున్న పోరాటంలో తమిళనాడు భారత సైన్యం వెంట నిలుస్తుంది. ఈ విషయంలో రాష్ట్రం దృఢ సంకల్పంతో ఉంది. జైహింద్‌’’ - ఎంకే స్టాలిన్  -‘‘ఉగ్రవాదం మళ్లీ పుట్టకుండా భారత సైన్యం దానిని పూర్తిగా


నిర్మూలించాలి. ప్రపంచంలో ఉన్న అన్నిరకాల ఉగ్రవాదాన్ని రూపుమాపాలి’’  - ఆదిత్య ఠాక్రే  -‘‘ఉగ్రవాదం.. వేర్పాటువాదం ఎప్పటికీ మనుగడలో ఉండకూడదు. నేడు మన భారత సైన్యం తీసుకున్న చర్యలు చూసి


గర్విస్తున్నాము’’ -ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ - ‘‘ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. పహల్గాంలో ఆత్మీయులను కోల్పోయిన


కుటుంబాలకు న్యాయం జరిగింది’’ -ఏక్‌నాథ్‌ శిందే  -‘‘భారత సైన్యం చర్యల పట్ల గర్వంగా ఉన్నాం. ఉగ్రవాదంపై పోరాటంలో దేశం మొత్తం సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది’’ - కేజ్రీవాల్   -‘‘విజయవంతంగా ఆపరేషన్


సిందూర్ నిర్వహించినందుకు భారత సైన్యానికి అభినందనలు. ఈ పోరాటంలో దేశం మొత్తం భారత సైన్యానికి మద్దతుగా ఉంది’’ -ఆతిశీ


Trending News

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Jiohotstar | latest jiohotstar - eenadu

రూ.60 కోట్ల బడ్జెట్‌.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. ఓటీటీలో ఖుషీకపూర్‌ లేటెస్ట్‌ మూవీ.. ఖుషీకపూర్‌, జునైద్‌ఖాన్‌ కీలక పాత్...

Latests News

Operation sindoor: ఉగ్రవాదాన్ని ప్రపంచం సహించకూడదు: కేంద్ర మంత్రి జైశంకర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్‌ బలగాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ ...

Ssc revised calendar: ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌ (రివైజ్డ్‌) విడుదల

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్(SSC) రివైజ్డ్‌ జాబ్‌ క్యాలెండర్‌న...

Politics: రాయలసీమలో రాజకీయ చక్రం తిప్పిన కుటుంబానికి కష్టాలు.. పరిటాల రవి ఫ్యామిలీ పోటీపై సందిగ్ధం

Published by: Last Updated:February 10, 2024 6:16 PM IST POLITICS: అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ నాయకుడు ప...

Vikarabad news | latest vikarabad news - eenadu

‘పారిశ్రామిక వాడ’ సర్వేలో ఉద్రిక్తత వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌(పారిశ్రా...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Top