S jaishankar: ‘ఇంకేమీ డిసైడ్‌ కాలేదు.. ఇప్పుడు మాట్లాడటం తొందరపాటే’: ట్రంప్ ‘జీరో టారిఫ్’ వ్యాఖ్యపై జైశంకర్‌

Eenadu

S jaishankar: ‘ఇంకేమీ డిసైడ్‌ కాలేదు.. ఇప్పుడు మాట్లాడటం తొందరపాటే’: ట్రంప్ ‘జీరో టారిఫ్’ వ్యాఖ్యపై జైశంకర్‌"

Play all audios:

Loading...

S Jaishankar: ఆపరేషన్ సిందూర్, భారత్‌-పాక్‌ కాల్పులు విరమణ ఒప్పందం గురించి విదేశాంగమంత్రి ఎస్‌. జైశంకర్ మాట్లాడారు.  ఇంటర్నెట్‌డెస్క్: కాల్పులు విరమణకు ఎవరు పిలుపునిచ్చారో స్పష్టంగా


వెల్లడైందని పాకిస్థాన్‌ను ఉద్దేశించి విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) అన్నారు. అలాగే చాలా వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లు ఆఫర్‌ చేసిందని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు


సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌, భారత్‌-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మేం ఆ దేశ మిలిటరీపై దాడి చేయలేదు.  మే 7న వెనక్కి తగ్గడానికి ఇష్టపడనివారు.. మే 10న మాత్రం


తగ్గారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో దీనిని బట్టి తెలుస్తోంది’’ అని మంత్రి అన్నారు. ట్రంప్‌ ‘జీరో టారిఫ్’ వ్యాఖ్య.. మంత్రి రిప్లై భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు


జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలకు తెరదించని పక్షంలో వాణిజ్యం నిలిపేస్తానంటూ ఇరుదేశాలకూ స్పష్టం చేశానని.. ఈ క్రమంలో అవి అంగీకారానికి వచ్చాయని ఇటీవల అమెరికా అధ్యక్షుడు


డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా రకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన సంచలన


ప్రకటనపైనా జైశంకర్ స్పందించారు. ‘‘రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి సంక్లిష్ట చర్చలు. ప్రతి అంశంపై నిర్ణయం తీసుకునేవరకు అవి కొనసాగుతూనే ఉంటాయి. వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా


ఉండాలి. అది జరిగేవరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుంది’’ అని ట్రంప్ ప్రస్తావన లేకుండా మంత్రి మాట్లాడారు. * భారత్‌ నోటి దగ్గర ‘యాపిల్‌’ లాగేస్తున్న ట్రంప్‌..! పాకిస్థాన్‌తో మరీ


ముఖ్యంగా కశ్మీర్‌ విషయంలో మూడోపక్షం జోక్యాన్ని భారత్‌ అనుమతించదు. కేంద్రంలోని ప్రతి ప్రభుత్వమూ ఇదే వైఖరిని అనుసరిస్తోంది. అలాంటిది.. తాజా ఉద్రిక్తతల వేళ కాల్పులు విరమణ గురించి ట్రంప్ ప్రకటన


చేయడం చర్చనీయాంశంగా మారింది. మన దేశ సమస్య అయిన కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చేయడాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై


తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేయడం మొదలైన విషయాలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధానిని కోరిన సంగతి


తెలిసిందే.


Trending News

Paritala sunitha | latest paritala sunitha - eenadu

జగన్‌.. గ్రామాల్లో ఫ్యాక్షన్‌ చిచ్చు పెట్టొద్దు: పరిటాల సునీత తన భర్త, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో వైకాపా అధ్యక్ష...

American citizenship: వలసదారులతో రియాలిటీ షో.. ప్రైజ్‌మనీ పౌరసత్వం

(వలసదారుల ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ...

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...

Stock market: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 880 పాయింట్లు డౌన్‌.. మళ్లీ 80 వేల దిగువకు

Stock market | ముంబయి: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్ర...

Cbse results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌..

CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుక...

Latests News

S jaishankar: ‘ఇంకేమీ డిసైడ్‌ కాలేదు.. ఇప్పుడు మాట్లాడటం తొందరపాటే’: ట్రంప్ ‘జీరో టారిఫ్’ వ్యాఖ్యపై జైశంకర్‌

S Jaishankar: ఆపరేషన్ సిందూర్, భారత్‌-పాక్‌ కాల్పులు విరమణ ఒప్పందం గురించి విదేశాంగమంత్రి ఎస్‌. జైశంకర్ మాట్లాడారు.  ఇంట...

Padma awards | latest padma awards - eenadu

PADMA AWARDS 2024: వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు క...

Sundar pichai | latest sundar pichai - eenadu

భారతీయులం కాబట్టే... తండ్రి ఐఏఎస్‌ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, తిరుపతి, ముస్సోరి, దిల్లీ, హైదరాబాద్‌లలో చదువుక...

National news | latest national news - eenadu

INDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్‌ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...

Prabhas | latest prabhas - eenadu

చరిత్ర సృష్టించి… విజేతలయ్యారు విజేతలు కొందరే ఉంటారు. రాజకీయం, సినిమా, వ్యాపారం, క్రీడారంగం... ఏది తీసుకున్నా తమదైన ముద్...

Top