Pm modi: ఆపరేషన్‌ సిందూర్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

Eenadu

Pm modi: ఆపరేషన్‌ సిందూర్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాకిస్థాన్‌ భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం


(India-Pak ceasefire) తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు(Modi address to Nation). పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, పాక్‌తో కాల్పుల


విరమణకు అంగీకారం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని ప్రసంగం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26మంది మృతిచెందిన ఘటన యావత్‌


ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్‌’తో పేరిట భారత సైన్యం పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని


తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత  మే 8, 9, 10 తేదీల్లో పాకిస్థాన్‌.. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌లు, క్షిపణి


దాడులకు విఫలయత్నం చేయగా.. దాయాది కుట్రలను భారత సైన్యం వీరోచితంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో 35 నుంచి 40మంది పాక్‌ సైనికుల్ని మట్టుబెట్టింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త


పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొనడంతో అమెరికా సహా పలు దేశాలు భారత్‌- పాక్‌ నడుమ మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాయి. ఇందులో భాగంగా సరిహద్దుల్లో కాల్పుల నిలిపివేతకు ఇరు దేశాలూ


అంగీకరించడంతో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం, అనంతర పరిస్థితిపై ఇరుదేశాల మధ్య సోమవారం మధ్యాహ్నమే ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (డీజీఎంవో)ల


మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. తాజాగా  ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతమైనట్లు రక్షణశాఖ అధికారులు ప్రకటించిన వేళ మోదీ ప్రసంగం ప్రకటన వెలువడటం గమనార్హం.


Trending News

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Latests News

Pm modi: ఆపరేషన్‌ సిందూర్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాకిస్థాన్‌ భారత్‌ చేపట...

Stories | short stories with moral | nithi kathalu - eenadu

కస్తూరీ పరిమళం ‘‘నీకు మైనుద్దీన్‌ అని ఎవరు పేరు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణస్నేహితుడు పల్లె ...

Sitara ghattamaneni | latest sitara ghattamaneni - eenadu

నాన్నే మా హీరో! సెలెబ్రిటీలు బయటకు వెళ్లారంటే జనాలు చుట్టుముట్టేస్తుంటారు. వాళ్లతో మాట్లాడాలనీ, కుదిరితే సెల్ఫీ తీసుకోవా...

Manchu vishnu: ముందు స్టంట్‌మ్యాన్‌ని.. అందుకు గర్వంగా ఉంది: మంచు విష్ణు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు విష్ణు (Manchu Vishnu). యాక్షన్‌ సీక్వె...

Priyanka chopra latest news in hindi, photos, videos on priyanka chopra inextlive jagran

न्यू ईयर सेलिब्रेशन की पिक्स में बला की हॉट लग रही हैं Priyanka Chopra, बस एक झलक ही काफी है bollywood-masala5 months ag...

Top