Gallstones: 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో 8,125 రాళ్లు
Gallstones: 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో 8,125 రాళ్లు"
Play all audios:
దేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు గంటపాటు శ్రమించి వాటిని
బయటకు తీశారు. దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు
గంటపాటు శ్రమించి వాటిని బయటకు తీశారు. దాదాపు 6 గంటలపాటు కష్టపడి మొత్తం 8,125 రాళ్లు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. తీవ్రమైన
కడుపునొప్పి, జ్వరంతో ఇటీవల ఆ వృద్ధుడిని కుటుంబ సభ్యులు పోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు మే 12న ల్యాప్రోస్కోపిక్ విధానంలో
పిత్తాశయం తొలగింపు శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇంత పెద్ద మొత్తంలో రాళ్లు ఏర్పడిన కేసు.. దిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో ఇదే మొట్టమొదటిదై ఉండొచ్చని యాజమాన్యం
అభిప్రాయపడింది. ‘‘శరీరంలో కొవ్వుల సమతాస్థితి లోపించడం వల్ల గాల్‌స్టోన్స్ (పిత్తాశయ రాళ్లు) ఏర్పడుతుంటాయి. ఇది అరుదైన కేసు. సమస్యను గుర్తించిన తర్వాత కూడా చాలా ఏళ్లపాటు పట్టించుకోకుండా
ఉంటేనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.’’అని డా. అమిత్ జావేద్ మీడియాకు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత రెండు రోజుల పాటు పరిశీలన
అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
ఆ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర: తెదేపా ఎంపీ కేశినేని చిన్నివైకాపా హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ (YS Jagan) కుట్ర చేస్తున్నారని తెద...
Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవేLava Shark 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...
Revanth reddy: అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా: సీఎం రేవంత్రెడ్డిమెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని స...
Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీదిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...
Latests News
Gallstones: 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో 8,125 రాళ్లుదేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 70 ఏళ్ల వృద్ధుడి ప...
Ktr: కాంగ్రెస్, భాజపా నాటకంలో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు: కేటీఆర్నల్గొండ: నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. భారాస అధిన...
Jairam ramesh: 21 రోజుల్లో 11 సార్లు ట్రంప్ నోట అదే మాట.. మోదీ స్పందనేదీ? : జైరాం రమేశ్Jairam Ramesh: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని ట్రంప్ చేస్తోన్న ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం...
Ap dsc hall tickets: ఏపీలో వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లుఏపీలో మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వాట్సప్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. AP...
Ayodhya ram mandir | latest ayodhya ram mandir - eenaduయాత్రల్లో.. ఎన్ని జ్ఞాపకాలో.. కొత్త జ్ఞాపకాలకు పెద్దపీట వేశారు... ప్రకృతి అందాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. హాయిగా విశ్రాంతి ...