Encounter: ‘అమ్మ’ చెప్పినా వినలేదు.. ఆర్మీ చేతిలో హతమయ్యాడు
Encounter: ‘అమ్మ’ చెప్పినా వినలేదు.. ఆర్మీ చేతిలో హతమయ్యాడు"
Play all audios:
అమ్మ చెప్పినా వినకుండా ఆర్మీపై కాల్పులు జరిపిన ఉగ్రవాది గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అంతకుముందు ఉగ్రవాది వాళ్ల అమ్మతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: ఎంతటి దుర్మార్గుడైనా అమ్మ దృష్టిలో మంచివాడే. కొడుకును సన్మార్గంలో నడిపించడానికి నిరంతరం ఆమె తాపత్రయపడుతూనే ఉంటుంది. కానీ, ఆమె మాటల్ని పెడచెవిన పెట్టిన ఓ ఉగ్రవాది సైన్యం
చేతిలో హతమయ్యాడు. గురువారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) పుల్వామా (Pulwama) జిల్లా థ్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో జేషే మహ్మద్ ముఠాకు చెందిన ఆమిర్
నజీర్ వని హతమైన సంగతి తెలిసిందే. అక్కడికి కొద్దిసేపటికి ముందే.. అతడు తల్లి, సోదరితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆర్మీ ఎదుట లొంగిపోవాలని వారిద్దరూ ఎంత చెప్పినా.. వినలేదు సరికదా.. ‘ఆర్మీని
ముందుకు రానివ్వండి.. వారి సంగతి చూస్తా’ అని పొగరుగా సమాధానమిచ్చాడు. వాళ్లు ఎంత ప్రాధేయపడినా పొమ్మన్నాడు. ఇదే ఘటనలో మృతి చెందిన మరో ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరితోనూ నజీర్ మాట్లాడాడు.
తన సోదరుడి గురించి ఆమె ఆరా తీస్తే తన దగ్గరే ఉన్నాడని బదులిచ్చాడు. అక్కడికి కొద్దిసేపటి తర్వాతే ఎన్‌కౌంటర్ జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో కాల్ ఫుటేజీ వైరల్ అవుతోంది. జమ్ముకశ్మీర్‌లోని
నాదిర్ గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు కనిపెట్టిన సైన్యం వారిని చుట్టుముట్టింది. లొంగిపోవాలని హెచ్చరించింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు జరిపిన
భద్రతబలగాలు ఆ ముగ్గుర్నీ మట్టుబెట్టాయి. హతులను ఆసిఫ్ అహ్మద్ షేక్, ఆమిర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు
చేస్తుస్తున్నారు.కాగా.. జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్‌పాథర్ కెల్లర్‌లో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను
భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తయ్యిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు.
Trending News
Ktr: హరీశ్‌రావుతో కేటీఆర్ భేటీ.. తాజా పరిణామాలపై సుదీర్ఘ చర్చహైదరాబాద్: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అనార...
Saraswati river pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు.. మీకివి తెలుసా?ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈ నెల 26 వరకు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ...
Pm modi: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయమంటూ మోదీ పోస్ట్దిల్లీ: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృ...
Mulugu: ములుగు జిల్లాలో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసుల మృతివాజేడు: ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్లు సమ...
Hydra: కూకట్‌పల్లిలో ఆక్రమణలను కూల్చేసిన హైడ్రా.. ప్లాట్ల యజమానుల హర్షంకూకట్పల్లి హైదర్‌నగర్ డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌ను ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా (Hydra) విడిపించింది. ఇక్కడ ప్లాట్లను కొన...
Latests News
Encounter: ‘అమ్మ’ చెప్పినా వినలేదు.. ఆర్మీ చేతిలో హతమయ్యాడుఅమ్మ చెప్పినా వినకుండా ఆర్మీపై కాల్పులు జరిపిన ఉగ్రవాది గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అంతకుముందు ఉగ్రవాది వాళ...
Vemula prashanth reddy | latest vemula prashanth reddy - eenaduPRASHANTH REDDY: ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల కలిగిన నష...
Raj bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీపంజాగుట్ట: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన చోటుచేసుకుంది. అందులోని సుధర్మ భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు రాజ్‌భవన్ ...
Kiit: నా బిడ్డకు భారత్ న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది: కీట్ విద్యార్థిని తండ్రిభువనేశ్వర్: ఒడిశాలో కీట్ (KIIT) విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. న్యాయం ...
Visakhapatnam and anakapalli district news - eenaduContents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...