Boy stuck in elevator: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

Eenadu

Boy stuck in elevator: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి"

Play all audios:

Loading...

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపదలో చిక్కుకున్న కన్నకొడుకును చూసి తట్టుకోలేకపోయాడో తండ్రి. తన బిడ్డను కాపాడుకోగలనా..? అన్న భయం అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తీవ్ర ఆందోళనకు గురై


చివరకు తన ప్రాణాలే కోల్పోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..(Son Stuck In Elevator) మధ్యప్రదేశ్‌ (Madhya


Pradesh) రాజధాని భోపాల్‌లో జత్కేడీ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో రిషిరాజ్‌ భట్నాగర్ (51) తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. సోమవారం రాత్రి తన కుమారుడిని వెతుక్కుంటూ ఇంటి నుంచి


కిందికి వచ్చారు. అతడు కనిపించడంతో ఇంటికి వెళ్లమని చెప్పాడు. దాంతో ఆ పిల్లాడు ఎలివేటర్ ఎక్కగా.. పవర్ కట్ అయింది. తన బిడ్డ అందులో ఇరుక్కుపోయాడని రిషిరాజ్‌ భయపడిపోయాడు. తీవ్ర ఆందోళనకు


గురికావడంతో గుండెపోటు (Heart Attack)కు గురయ్యాడు. కొన్ని నిమిషాల్లో పవర్ రావడంలో ఆ ఎనిమిదేళ్ల పిల్లాడు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ ఆలోపే ఆ కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పడిపోయిన


రిషిరాజ్‌ను చూసి, అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. అతడు గుండెపోటుకు గురయ్యాడని,


పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి విషయాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మూడు నిమిషాల్లో పవర్ రావడంతో పిల్లాడు లిఫ్ట్‌ నుంచి బయటకు వచ్చాడని, పూర్తి క్షేమంగా ఉన్నాడని వెల్లడించారు. సోమవారం


రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


Trending News

దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!

దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితన...

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

అగ్రి గోల్డ్‌ బాధితులకు తీపి కబురు

సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్‌ బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...

Who: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్ర స్థాయిలో  (Israel-Hamas Conflict) దాడులతో విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు పె...

Pawan kalyan: ప్రమాదంలో పిఠాపురం.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్!

Published by: Last Updated:September 08, 2024 10:32 PM IST PAWAN KALYAN: రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. కొన్...

Latests News

Boy stuck in elevator: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపదలో చిక్కుకున్న కన్నకొడుకును చూసి తట్టుకోలేకపోయాడో తండ్రి. తన బిడ్డను కాపాడుకో...

Telangana news: సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

జయశంకర్‌ భూపాలపల్లి: తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ (Jishnu Dev Varma) కాళేశ్వరానికి చేరుకున్నారు. హెలికాప్టర్‌లో కుట...

Hyderabad: బ్యాండ్‌ సిబ్బందినీ వదలని ఎస్సై.. రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి..

హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి చిక్కిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు ...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (28/05/2025)

28/05/2025 15:06(IST) రాజస్థాన్‌, త్రిపుర, ఝార్ఖండ్‌, మద్రాస్‌ హైకోర్టుల సీజేలు బదిలీ * 4 హైకోర్టుల సీజేల బదిలీకి సుప్రీ...

Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!

Published by: Last Updated:April 22, 2023 2:45 PM IST STOCK MARKET | ఈ వారంలో పలు స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపాయి. ఇన్...

Top