Muda case: ముడా కేసు.. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాల్లేవ్ : లోకాయుక్త
Muda case: ముడా కేసు.. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాల్లేవ్ : లోకాయుక్త"
Play all audios:
ముంబయి: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
ఎదుర్కొంటోన్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి, తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై
తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేకపోవడంతో నిరూపితం
కాలేదని తెలిపారు. ఈ నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు స్నేహమయికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంచేశారు. * అన్ని ఎక్కువ
టికెట్లు ఎందుకు అమ్మారు..?: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది. దీంతో ఈ కేసు తెరపైకి వచ్చీ రాగానే
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులోనే లోకాయుక్త విచారణకు ఆదేశించింది. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిర్యాదుదారులు టి.జె.అబ్రహం, స్నేహమయి కృష్ణ పిటీషన్లపై విచారణ
చేపట్టిన కోర్టు గత సెప్టెంబరులో నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జునపై కేసులు నమోదు కావటం, లోకాయుక్త ఎస్పీ టి.జె.ఉదేశ్
నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఏ1 నిందితుడిగా కేసు నమోదు కాగానే ఆయన భార్య తనకు ముడా ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇచ్చేయడం, విచారణ కోసం గతేడాది నవంబరు 5న ముఖ్యమంత్రి మైసూరులోని
లోకాయుక్త కార్యాలయంలో విచారణకు హాజరవటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ విచారణ ప్రక్రియలో ముఖ్యమంత్రి గానీ, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర గానీ లేదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Latests News
Muda case: ముడా కేసు.. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాల్లేవ్ : లోకాయుక్తముంబయి: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు భారీ ఉపశమన...
Shubhanshu shukla: ఐఎస్ఎస్కు శుభాంశు శుక్లా.. ఆ ప్రత్యేక వాచ్ ధరించనున్న భారత వ్యోమగామిఇంటర్నెట్డెస్క్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష కేంద్రం (International Space Station)లో ప్ర...
Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నో..Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిరాసక్తత చూపిస్...
ఇకపై తుపానుల ముప్పు ఎక్కువసాక్షి, అమరావతి: అంఫన్.. సూపర్ సైక్లోన్.. నిసర్గ.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ మూడు తుపానులు వరుసగా తూర్పు కోస్తా, ...
Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...