Jaishankar: అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకం: కేంద్రమంత్రి జైశంకర్
Jaishankar: అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకం: కేంద్రమంత్రి జైశంకర్"
Play all audios:
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆపరేషన్ సిందూర్‌పై ఆస్ట్రియా విదేశాంగశాఖ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో ఆపరేషన్ సిందూర్ గురించి ఫోన్‌లో చర్చలు జరిపారు. Operation Sindoor ||
ఇంటర్నెట్‌డెస్క్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్‌పై భారత్ ఇప్పటికే దౌత్య చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాయాది (Pakistan)పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత్
సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్రం పలు దేశాల రాయబారులు, విదేశాంగమంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్ ఇస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) ఆపరేషన్ సిందూర్‌పై
ఆస్ట్రియా (Austria) విదేశాంగశాఖ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్ (BMeinl)తో ఫోన్‌లో చర్చలు జరిపారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల గురించి మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం
సహించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి, అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకమనే అంశాలపై ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు జైశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య
కొనసాగుతున్న యుద్ధం గురించీ తాము చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం జైశంకర్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడారు. భారత్ ఉగ్రవాదాన్ని ఏ
మాత్రం సహించదని వారికి తెలియజేశారు. ఇతర ప్రపంచ దేశాల ప్రతినిధులతో చర్చించారు. పాక్‌పై మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి.. మద్దతు కొనసాగించాలని కోరారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)
అనంతరం పాక్‌పై భారత్ చేపట్టిన చర్యల గురించి చైనా, అమెరికా, జపాన్, జర్మనీ, యూకే, రష్యా వంటి 70 దేశాల దౌత్యాధికారులకు భారత్ వివరించింది. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ (India) వేసిన ముందడుగు,
అనంతరం చోటుచేసుకున్న పరిణామాల వివరాలను వారికి తెలియజేసింది.
Trending News
Rahul gandhi: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: రాహుల్ గాంధీచార్మినార్ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాం...
Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనటెస్టు క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచింది: ఆరెస్సెస్ చీఫ్పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర...
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (25-05-2025) బంధు,మిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస...
Stock market: ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. 25 వేల దిగువకు నిఫ్టీStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠ...
Latests News
Jaishankar: అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకం: కేంద్రమంత్రి జైశంకర్కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆపరేషన్ సిందూర్‌పై ఆస్ట్రియా విదేశాంగశాఖ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో ఆపరేషన్...
Union budget 2025: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు.. బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లుUnion Budget 2025: బిహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్రంపై బడ్జెట్‌లో ఆర్థిక వరా...
Water intake: నీరు సరిగ్గా తాగుతున్నారా.. వీటిని లెక్కలోకి తీసుకోవాలట..ఇంటర్నెట్ డెస్క్: నీరు మనకు ప్రాణాధారం. ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియలకు ఎంతో అవసరం. మన ఆరోగ్...
అటో మొబైల్ అమ్మకాలో రెండంకెల క్షీణత: క్రిసిల్ రీసెర్చ్దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడగింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతకు దారితీస్తుందని క...
Telangana cm kcr's daughter prathyusha gets marriedThe wedding of Chief Minister K Chandrashekar Rao’s daughter C Pratyusha's was held in Keshampet, Shadnagar near Hy...