Gujarat: బాణసంచా, డ్రోన్లపై నిషేధం: గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయం

Eenadu

Gujarat: బాణసంచా, డ్రోన్లపై నిషేధం: గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయం"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు (India Pakistan Tensions) తారస్థాయికి చేరుతున్న క్రమంలో సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత


పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్‌ సంఘవి


తాజాగా ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరూ దీనిని పాటించాలని కోరారు. ‘‘రాష్ట్రంలో జరిగే ఏ వేడుకల్లోనైనా బాణసంచా, డ్రోన్లపై ఈ నెల 15 వరకు నిషేధం విధిస్తున్నాం. దయచేసి ఈ మార్గదర్శకాలను పాటించాలని,


ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ పోస్ట్‌ పెట్టారు. పహల్గాం


ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను మనదేశం ధ్వంసం చేసిన క్రమంలో సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్,


పశ్చిమబెంగాల్‌ పటిష్ఠమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గుజరాత్‌ (Gujarat) ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు (India


Pakistan Tensions) పెరుగుతున్న వేళ భద్రతా సన్నద్ధతపై ప్రధాని ఆరాతీసి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్‌, బనస్కంతా, పటాన్‌, జామ్‌నగర్‌లో పౌరుల


భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగారు. పాకిస్థాన్‌తో పంజాబ్‌ 532 కి.మీ.; రాజస్థాన్‌ 1070 కి.మీ.; గుజరాత్‌ 506 కి.మీ.; బంగ్లాదేశ్‌తో పశ్చిమబెంగాల్‌ 2,217 కి.మీ.


సరిహద్దును పంచుకుంటున్నాయి.


Trending News

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Karthika deepam: దీపను లేపేద్దాం.. మాస్టర్ ప్లాన్ వేసిన పారిజాతం.. అయ్యో వంటలక్క చచ్చిపోతుందా?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

Latests News

Gujarat: బాణసంచా, డ్రోన్లపై నిషేధం: గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు (India Pakistan Tensions) తారస్థాయికి చేరుతున్న క్రమంలో సరిహద్...

Akash missile: ఐరన్‌డోమ్‌ లాంటి ‘ఆకాశ్‌’.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వ...

Telangana news | latest telangana news - eenadu

INDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్‌ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...

Punjab news | latest punjab news - eenadu

ప్రభుత్వ మార్పు ఊహాగానాల వేళ.. కేజ్రీవాల్‌- పంజాబ్ సీఎం భేటీ Arvind Kejriwal-Bhagwant Mann: దిల్లీలో పరాజయం, పంజాబ్‌లో ప...

Ipl 2025: ఐపీఎల్ 2025: ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే?

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. ముల్లాన్‌పుర్, అహ్మదాబాద్‌లో నాలుగు ప్లే ...

Top