Operation sindoor: ఫలించిన భారత్‌ దౌత్యం.. పాక్‌ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా

Eenadu

Operation sindoor: ఫలించిన భారత్‌ దౌత్యం.. పాక్‌ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా"

Play all audios:

Loading...

భారత్‌ దాడుల్లో పాకిస్థాన్‌లో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ చేసిన ప్రకటనను కొలంబియా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) సమయంలో


పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్‌  (Shashi Tharoor) అసహనం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే తమ సంతాప ప్రకటనను


కొలంబియా (Colombia) వెనక్కి తీసుకుంది.  ఉగ్రవాదంపై పాకిస్థాన్ (Pakistan) అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి


తెలిసిందే. అందులోభాగంగా థరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఈక్రమంలో ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్‌ విల్లావిసెన్సియోతో థరూర్ భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ


తర్వాత భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన పూర్తి విషయాలను ఆయన తెలియజేశారు. అనంతరం యెలాండ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘ఈ రోజు భారత


బృందం మాకు అన్ని విషయాలను తెలియజేసింది. కశ్మీర్‌లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నాం. దాడులకు దారితీసిన పరిస్థితిపై అవగాహన వచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం థరూర్ కొలంబియా


ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని వారు పూర్తిగా తెలుసుకున్నారని థరూర్‌ తెలియజేశారు.  * పాక్‌లో ఉగ్రవాదులు హతమైతే సంతాపమా..? శశిథరూర్‌ కొలంబియాకు పర్యటనకు వెళ్లిన థరూర్


అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. దాదాపు నాలుగు


దశాబ్దాలుగా భారత్‌ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు. పాకిస్థాన్‌ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా.. పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోందని వివరించారు.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Operation sindoor: ఫలించిన భారత్‌ దౌత్యం.. పాక్‌ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా

భారత్‌ దాడుల్లో పాకిస్థాన్‌లో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ చేసిన ప్రకటనను కొలంబియా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  ఇంట...

Russia: రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఏడుగురి మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న బ్రయాన్స్క్‌ ప్రాంతం...

Whatsapp: నచ్చిన లేఅవుట్‌, మోర్‌ విత్‌ మ్యూజిక్‌.. వాట్సప్‌ స్టేటస్‌ కోసం నాలుగు కొత్త ఫీచర్లు..

WhatsApp | ఇంటర్నెట్‌ డెస్క్‌: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) స్టే...

Operation sindoor: టీవీ ప్రసారాల్లో సైరన్‌లు వాడొద్దు - మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీ

పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను (Air Raid Sirens) వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లక...

Kkr vs rcb: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతాకు షాక్‌ ఇచ్చిన ఆర్సీబీ

కోల్‌కతా: ఐపీఎల్‌ (IPL) 18వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) బోణీ కొట్టింది. డిఫెండింగ...

Top