Ap liquor scam: ఏపీ మద్యం కుంభకోణం.. గోవిందప్ప బాలాజీని కోర్టులో హాజరు పరిచిన సిట్‌

Eenadu

Ap liquor scam: ఏపీ మద్యం కుంభకోణం.. గోవిందప్ప బాలాజీని కోర్టులో హాజరు పరిచిన సిట్‌"

Play all audios:

Loading...

వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీని సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. విజయవాడ: వైకాపా హయాంలో జరిగిన


మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో అరెస్టయిన భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీని సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో


వైద్యపరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. ఈ కేసులో గోవిందప్ప బాలాజీ ఏ33గా ఉన్నారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి ‘అంతిమ లబ్ధిదారు’కు


చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారు.  నెల రోజులుగా పరారీలో ఉన్న


గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేశాయి.


మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్‌నెస్‌  సెంటర్‌ బయట ఆయన్ను అరెస్ట్‌ చేశాయి. ట్రాన్సిట్‌ వారంట్‌ నిమిత్తం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విజయవాడకు


తీసుకొచ్చి నేడు ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Fact check: ఆ కాన్వాయ్‌పై దాడి వీడియో నిజం కాదు: కేంద్రం క్లారిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన జవాన్లపై దాడి జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అవుతున్న నకిలీ వీడియోపై కేంద్రం స్పందించింది...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...

Latests News

Ap liquor scam: ఏపీ మద్యం కుంభకోణం.. గోవిందప్ప బాలాజీని కోర్టులో హాజరు పరిచిన సిట్‌

వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీని సిట్‌ అధ...

Samantha: ‘శుభం’పై తల్లి స్పందన.. ఆ దర్శకుడితో దిగిన ఫొటో: సమంత పోస్టు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో ప్రముఖ నటి సమంత (Samantha) నిర్మించిన తొలి సినిమా ‘శ...

Hyderabad: పాతబస్తీ అగ్నిప్రమాదం.. విచారణకు ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ

పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌ చౌరస్తా సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆరుగుర...

Samantha: ప్రస్తుతం అన్నీ రిస్కే కానీ.. : సమంత

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మారారు ప్రముఖ నటి సమంత (Samantha). వర్ధమాన నటులతో ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవ...

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. ఉదయం 10. 30 గంటలకు ఆర్మీ ప్రెస్‌మీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌ భూభాగంలోని తొమ్మి...

Top