Chandrababu: నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చంద్రబాబు

Eenadu

Chandrababu: నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చంద్రబాబు"

Play all audios:

Loading...

దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కడప: దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషి


చేస్తానని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో  పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘నా ఎంపికకు సహకరించిన ప్రతి


ఒక్కరికీ  ధన్యవాదాలు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా ఉంటుంది. నా బలం, బలగం తెదేపా. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. రాబోయే


40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ తెదేపా. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు..రత్నాల సీమగా


మారుస్తానని చెప్పాం. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి తెదేపా కారణం. హైదరాబాద్‌లో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశాం. తెదేపా అధికారంలో ఉంటే అందరికీ రక్షణ ఉంటుంది. 2027 నాటికి పోలవరం


ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. హంద్రీనీవా కింద చివరి భూములకు నీళ్ల కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేశాం. పోలవరం తర్వాత హంద్రీనీవాకు భారీగా ఖర్చు చేస్తున్నాం. వెలిగొండతో పాటు మిగతా


ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు.. * 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి.. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు


చేస్తాం * రాష్ట్రాన్ని లాజిస్టిక్స్‌ హబ్‌గా మారుస్తాం * జాతీయ రహదారులకు రూ.1.2లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం * రాష్ట్రంలో 24వేల కిలోమీటర్ల మేర గ్రామాల్లో రోడ్లు వేశాం * రాబోయే రోజుల్లో


ఉండేది ఒకే ఇజం.. అదే టూరిజం. పర్యాటకం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు * గండికోటలో ఏడాదిలో కృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేస్తాం * తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటా * ఆగస్టు 15 నుంచి


ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం * వంట గ్యాస్‌ డబ్బులు నాలుగు నెలలకోసారి ఖాతాల్లో జమ * రూ.9వేల కోట్లతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం. 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం * కడప స్టీల్‌


ప్లాంట్ ద్వారా 3వేల మందికి ఉపాధి అవకాశాలు


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Chandrababu: నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చంద్రబాబు

దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు...

Kotamreddy: వైకాపా ప్రభుత్వ విధానాలు నచ్చక ఎదిరించి పోరాడా: ఎమ్మెల్యే కోటంరెడ్డి

వైకాపా ప్రభుత్వ విధానాలు నచ్చక ఎదిరించి పోరాడానని తెదేపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ...

Gamblers: జూన్‌ 6న ‘గ్యాంబ్లర్స్‌’.. పోస్టర్‌ విడుదల చేసిన టీమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సంగీత్‌ శోభన్‌. ...

Jasprit bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదు: సంజయ్‌ మంజ్రేకర్‌

జస్ప్రీత్‌ బుమ్రాకు టెస్ట్‌ పగ్గాలు అప్పగించకపోవడంపై టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తన అసంతృప్తిని వ్యక్...

Virat kohli: లఖ్‌నవూపై ఆర్సీబీ విజయం.. ఒకే మ్యాచ్‌లో కోహ్లీ 3 రికార్డులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఐపీఎల్‌ (IPL) సీజన్‌ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తూ ఇప్పుడు క్వాలిఫయర్‌-1 పోరుకు చేరుకుంది రాయ...

Top