Rbi: ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో రెపో రేటును ఆర్‌బీఐ మారుస్తుందా..? నిపుణుల విశ్లేషణ..

Telugu

Rbi: ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో రెపో రేటును ఆర్‌బీఐ మారుస్తుందా..? నిపుణుల విశ్లేషణ.."

Play all audios:

Loading...

యథాతథంగా రెపో రేటు..? హై రిటైల్ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ పరిస్థితుల కారణంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించే యోచనలో ఉంది. ముఖ్యంగా


ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, మార్కెట్‌లో టైట్‌ లిక్విడిటీ కారణంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లు సవరించకపోవచ్చని ఆర్థికవేత్తలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. advertisement ఆర్బీఐకి ప్రభుత్వం ఆదేశాలు.. 2023


ఆగస్టు నాటికి, కన్సూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(CPI) బేస్డ్‌ రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ జులైలో 7.44 శాతం నుంచి 6.83 శాతానికి కొద్దిగా తగ్గింది. అయితే ఈ సంఖ్య ఆర్‌బీఐ కంఫర్ట్ లెవెల్ 6 శాతం కంటే


ఎక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించాలని ప్రభుత్వం ఆర్‌బీఐని ఆదేశించింది. అయితే ఇరువైపులా 2 శాతం పర్మిషబుల్‌ మార్జిన్ ఉంటుంది. 2023 సెప్టెంబర్‌లో CPI ఇన్‌ఫ్లేషన్‌ మునుపటి


నెల 6.83 శాతం నుంచి 5.3- 5.5 శాతానికి మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. టమాటాల ధరల తగ్గుదల, అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ వంటి అంశాలతో ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నారు.


advertisement హెచ్చు తగ్గులు.. ముందున్న పరిస్థితులను అంచనా వేస్తే.. CPI ద్రవ్యోల్బణం మితంగా కొనసాగుతుందని, 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5.6 శాతానికి చేరుతుందని అదే సంవత్సరం నాలుగో


త్రైమాసికంలో 5.1 శాతానికి మరింత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆహార ద్రవ్యోల్బణం రిస్కులను కూడా హైలైట్ చేశారు. తక్కువ వర్షపాతం, పంట దిగుబడిని ప్రభావితం చేసే లో


రిజర్వాయర్‌ లెవల్స్‌ వంటివి ప్రధాన కారకాలు కావచ్చని పేర్కొన్నారు. advertisement ఆర్‌బీఐ అంచనాలు.. ఆర్‌బీఐ స్వయంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి CPI ఇన్‌ఫ్లేషన్‌ని 5.4 శాతంగా అంచనా వేసింది.


త్రైమాసిక గణాంకాలు Q2కి 6.2 శాతం, Q3కి 5.7 శాతం, Q4కి 5.2 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు నష్టాల సమతుల్య అంచనాతో కూడి ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ద్రవ్యోల్బణం 5.2 శాతంగా


అంచనా వేసింది. భవిష్యత్తులో తగ్గుతాయా..? మెడికల్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ, మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ సహా వివిధ రంగాలు వృద్ధిని ప్రేరేపించడానికి వడ్డీ రేట్లను తగ్గించాలని ఆశిస్తున్నాయి. అయితే


అధిక రిటైల్ ద్రవ్యోల్బణం, యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వైఖరి నేపథ్యంలో సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని భావిస్తున్నారు, సమీప


భవిష్యత్తులో రేట్ల తగ్గింపు సూచనలు ఆశిస్తున్నారు. advertisement సభ్యులు వీళ్లే.. మానిటరీ పాలసీ కమిటీలో ముగ్గురు ఎక్స్‌టర్నల్‌ మెంబర్స్‌, ముగ్గురు ఆర్‌బీఐ అధికారులు ఉంటారు. ప్యానెల్‌లోని


ఎక్స్‌టర్నల్ మెంబర్స్‌ శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ. ఆర్‌బీఐ గవర్నర్ దాస్‌తో పాటు, ఇతర ఆర్‌బీఐ అధికారులు రాజీవ్ రంజన్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), మైఖేల్ దేబబ్రత పాత్ర (డిప్యూటీ


గవర్నర్) ఉన్నారు. Stay updated with the latest news, Download the News18 App to stay updated! Location : Hyderabad,Telangana First Published : September 25, 2023 10:31 AM IST


Trending News

Honda Amaze: తక్కువ ధరకే లగ్జరీ కారు.. అబ్బురపరిచే ఫీచర్స్! లాంచింగ్ ఎప్పుడంటే

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Popular comedian Bithiri Sathi assaulted for alleged ‘anti-Telangana’ statements

Comedian Chevella Ravi, popularly known as Bithiri Satti after the name of his character in the show Teenmaar News, was ...

Polavaram-banakacharla: ‘పోలవరం-బనకచర్ల’పై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు

అమరావతి: ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. పోలవరం నుంచి బనకచర్లకు ...

Peddapalli: పిల్లలకి ఇవి ఖచ్చితంగా తినిపించాలట.. డాక్టర్ మాటలు విందామా!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Telangana rains: godavari reaches third flood warning mark at bhadrachalam

The Godavari river reached the third level flood warning at Bhadrachalam in Telangana on Monday, July 11, prompting auth...

Latests News

Rbi: ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో రెపో రేటును ఆర్‌బీఐ మారుస్తుందా..? నిపుణుల విశ్లేషణ..

యథాతథంగా రెపో రేటు..? హై రిటైల్ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ పరిస్థితుల కారణంగా ...

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (12-06-2025) పెద్దల సహకారం తోడ్పడుతుంది.  ప్రారంభించిన పను...

రూ. 24,000 ధర తగ్గిన 1. 5 టన్ ఏసీ, 5 స్టార్ రేటింగ్. రూ. 1,745కి పొందండి

దీని బరువు 11.5 కేజీలు ఉంది. బయటి యూనిట్ బరువు 27.4 కేజీలు ఉంది. మీకు ఈ ప్రొడక్టుతో 1 ఇండోర్ యూనిట్, 1 అవుట్‌డోర్ యూనిట్...

Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagran

तस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...

Bharat jodo yatra: rahul gandhi unfurls national flag in front of charminar

Congress leader Rahul Gandhi on Tuesday unfurled the national flag in front of the iconic Charminar here, over 32 years ...

Top