ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ
ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ"
Play all audios:
ప్రతీకాత్మక చిత్రం సాక్షి, హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో ఆ దంపతులు భద్రపరుచుకున్న స్పెర్మ్.. ఇప్పుడు వారికి పండంటి బిడ్డను ప్రసాదించింది. కేన్సర్ చికిత్సకు వెళ్లే ముందు
వైద్యుల సలహా మేరకు ఆయన తన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. దాన్ని వినియోగించిన ఐసీఎస్ఐ (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్) ద్వారా ఇప్పుడు వారు తల్లిదండ్రులయ్యారు.
2012లో 23 ఏళ్ల కార్తీక్ (పేరు మార్చాం)కు వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్ ట్యూమర్ (కేన్సర్)తో బాధపడుతున్నట్లుగా
వైద్యులు గుర్తించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చికిత్సలో ఎదురయ్యే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని.. అతడి వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో
భద్రపరుచుకోమని వైద్యుడు సలహా ఇచ్చారు. దీంతో 2012లో కేన్సర్ చికిత్స ప్రారంభానికి ముందు కార్తీక్ తన వీర్యాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్యాంకులో భద్రపరిచాడు. సంవత్సరం క్రితం ఆయన కేన్సర్ వ్యాధి
నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే.. కిమోథెరపీ, రేడియోథెరపీ మోతాదుల కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో భద్రపరిచిన వీర్యం ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్న ఆ
దంపతులు.. ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించారు. ఐసీఎస్‌ఐను మాక్స్(మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని తయారుచేసి..
మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. అలా గర్భం దాల్చిన ఆ మహిళ గత వారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి తల్లిబిడ్డలు డిశ్చార్జయ్యారు.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Kolleru lake must be protected: andhra cm chandrababu naiduVIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...
Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీStock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థి...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
2025 honda rebel 500: మార్కెట్లోకి హోండా రెబల్ 500.. ధర @రూ. 5. 12 లక్షలు2025 Honda Rebel 500 | ఇంటర్నెట్ డెస్క్: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త మోటార్ సైకిల్‌ను దేశీయ మార...
Latests News
ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డప్రతీకాత్మక చిత్రం సాక్షి, హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో ఆ దంపతులు భద్రపరుచుకున్న స్పెర్మ్.. ఇప్పుడు వారి...
Bigg boss 7: నీ పేరెత్తితే చెప్పుతో కొట్టు..! హాట్ టాపిక్‌గా రతిక- పల్లవి ప్రశాంత్ యవ్వారం!!ఈ సారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శ...
Tana: తానా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్రీడాకారుల కోసం వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసి...
Salman khan: సల్మాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. అరెస్టుబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వ...
India: పాక్ సైతం ఉగ్రవాదులను అప్పగించాలి: భారత దౌత్యవేత్తఇంటర్నెట్డెస్క్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్ (JP Singh)...