జొకోవిచ్ కొత్త చరిత్ర
జొకోవిచ్ కొత్త చరిత్ర "
Play all audios:
రోమ్: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కొత్త చరిత్ర సృష్టించాడు. సోమవారం ముగిసిన ఇటాలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి అత్యధిక
మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీకి ముందు రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ 35 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా
విజయంతో నాదల్‌ను వెనక్కి నెట్టి జొకోవిచ్ 36 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్
జొకోవిచ్ 7–5, 6–3తో విజయం సాధించాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 2,05,200 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్
ఓపెన్, దుబాయ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్లలో కూడా ఈ సెర్బియా స్టార్ విజేతగా నిలిచాడు. చాంప్ హలెప్... ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా)
విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 2–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ప్లిస్కోవా తొడ కండరాల గాయంతో
మ్యాచ్ నుంచి వైదొలిగింది. విజేత హలెప్‌కు 2,05,190 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కాయి.
Trending News
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయంReported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...
Malayalam cinema for everyone: from 'manjummel boys,' to 'premalu' and 'aavesham'During its exceptional run in Tamil Nadu, _Manjummel Boys_ became the first Malayalam film ever to gross over `50 crores...
Tdp mahanadu | latest tdp mahanadu - eenaduవైకుంఠపాళి మనకొద్దు అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం, మళ్లీ కింద పడటం, మళ్లీ ఎక్కడం, మ...
Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...
Uttam kumar reddy: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం: మంత్రి ఉత్తమ్ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది...
Latests News
జొకోవిచ్ కొత్త చరిత్రరోమ్: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కొత్త చరిత్ర ...
Irctc tourism: రూ. 15 వేలకే 9 రోజులు సౌత్ ఇండియా టూర్... ప్యాకేజీ వివరాలివేఎనిమిదో రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, తొమ్మిదో రోజు సికింద్రాబాద్ చ...
Cm chandrababu: ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబుకర్నూలు: రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని...
Ajay devgn: ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు.. కానీ: అజయ్ దేవ్గణ్ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ (...
6 fakta lalibela, yerusalem versi etiopia24 Mar 2019, 11:50 WIB instagram.com/nomabidaiak Etiopia ialah salah satu negara tertua di dunia. Selain itu, negara ini...