Us: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి
Us: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి"
Play all audios:
న్యూయార్క్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో (Road Accident in US) ప్రాణాలు కోల్పోయారు. వారు (Indian Students) ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి
చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను 23 ఏళ్ల సౌరవ్ ప్రభాకర్, 20 ఏళ్ల మానవ్ పటేల్‌గా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి
వచ్చింది. వీరిద్దరూ ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మే 10న పెన్సిల్వేనియాలోని లాంకస్టరన్ కౌంటీలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న
చెట్టును ఢీకొట్టి వంతెన మధ్యలో ఇరుక్కుపోయింది. ప్రమాద సమయంలో సౌరవ్ ప్రభాకర్ వాహనాన్ని నడుపుతుండగా.. మానవ్, మరో వ్యక్తి కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో సౌరవ్, మానవ్ అక్కడికక్కడే ప్రాణాలు
కోల్పోగా.. మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. * భూగర్భ సొరంగాలు.. అణు కార్యక్రమాలు..! @ కిరానా హిల్స్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని,
మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దౌత్య కార్యాలయం వెల్లడించింది.
Trending News
Technology | latest tech news today - eenaduఐఫోన్ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్ కొన్నారా? పాత ఐఫోన్ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...
India operations: ఆపరేషన్ ‘మేఘ్‌దూత్ నుంచి సిందూర్’ వరకుఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...
సేవా సైనికులు.. మీకు సెల్యూట్: సీఎం జగన్సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...
కాస్ట్‌లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితంఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్ మోహన్ మిత్రా(ఫైల్) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...
Latests News
Us: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతిన్యూయార్క్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో (Road Accident in US) ప్రాణాలు...
Vikram misri press briefing: అఫ్గాన్‌కు గుర్తు చేయనక్కర్లేదు.. పాక్‌వి పనికిమాలిన ఆరోపణలు: విక్రమ్ మిస్రీOperation Sindoor: పాకిస్థాన్ అనవసరమైన ఆరోపణలతో అందర్నీ పక్కదారి పట్టిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ...
Astrology: 2023 జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది.. శని దయతో అన్నీ విజయాలేCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Home decor items | latest home decor items - eenaduబంతిపూల బతుకమ్మ! ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ’ అంటూ తెలంగాణ ఆడబిడ్డలు ఆడి, పాడే వేడుక బతుకమ్మ. ఇల...