Donald trump: ఎఫ్‌-55 ఫైటర్‌ జెట్‌ల తయారీపై అమెరికా దృష్టి: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Eenadu

Donald trump: ఎఫ్‌-55 ఫైటర్‌ జెట్‌ల తయారీపై అమెరికా దృష్టి: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు"

Play all audios:

Loading...

Donald Trump ఇంటర్నెట్‌డెస్క్‌: యుద్ధవిమానాల చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ఫైటర్‌ జెట్‌గా ఎఫ్‌-22 రాప్టర్‌కు పేరుంది. వీటిని అమెరికా రూపొందించినా.. ఏ మిత్ర దేశానికి విక్రయించలేదు. పరిమిత


సంఖ్యలో తయారు చేసింది. తాజాగా అప్‌గ్రేడ్‌ చేయాలని అమెరికా సర్కారు భావిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ఖతార్‌ పర్యటనలో భాగంగా ఆయన దోహాలో బోయింగ్‌,


జీఈ ఏరోస్పేస్‌ సీఈవోలు సహా పలువురు వ్యాపారవేత్తలతో మాట్లాడారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారు చేసిన ఎఫ్‌-35 ప్రత్యామ్నాయంగా ఎఫ్‌-55ను అభివృద్ధి చేసే అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఎఫ్‌-22


రాప్టర్‌కు అప్‌గ్రేడ్‌గా ఎఫ్‌-22 సూపర్‌ఫైటర్‌ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘మేము ఎఫ్‌-55ను తయారు చేయనున్నాం. మాకు ఇది రెండు ఇంజిన్లతో మంచి ధరకు లభిస్తుందని భావిస్తున్నా. ఇక


ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-22  దానికి సూపర్‌ వెర్షన్‌ తీసుకురానున్నాం. ఇది చాలా అత్యాధునికంగా ఉండనుంది’’ అని వెల్లడించారు. ఇటీవలే ప్రకటించిన ఎఫ్‌-47 యుద్ధ విమానం


అభివృద్ధి కాంట్రాక్టును ట్రంప్‌ సర్కారు ఇప్పటికే బోయింగ్‌కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీనిని అమెరికాలోనే అత్యాధునిక ఆరో తరం ఫైటర్‌గా రూపొందించాలని నాడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో


ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌ సర్కారు ఎఫ్‌-35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు ఆసక్తి చూపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్న 5వతరం అత్యాధునిక యుద్ధవిమానం


ఎఫ్‌-35. రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల కళ్లుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు


ఉన్నాయి. దీనిలో మూడు వేరియంట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానం అభివృద్ధికి 2 ట్రిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించారు.  


Trending News

Virat kohli: విరాట్‌ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

టెస్టు క్రికెట్‌కు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...

Cm chandrababu: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే: సీఎం చంద్రబాబు

రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు దిశానిర్...

Mi vs dc: దిల్లీ ఇంటికి.. చివరి ప్లే ఆఫ్స్‌ బెర్తు ముంబయిదే

ముంబయి: ఐపీఎల్‌ (IPL) 2025లో ప్లే ఆఫ్స్‌ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ది...

Kavitha | latest kavitha - eenadu

డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా భారాస మునిగిపోతున్న నావ అని, డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా అని, కవిత కేసీఆర్‌కు రాసిన లేఖకు ప్రా...

Shubhanshu shukla: ఐఎస్‌ఎస్‌కు శుభాంశు శుక్లా.. ఆ ప్రత్యేక వాచ్‌ ధరించనున్న భారత వ్యోమగామి

ఇంటర్నెట్‌డెస్క్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష కేంద్రం (International Space Station)లో ప్ర...

Latests News

Adilabad news | latest adilabad news - eenadu

వడదెబ్బతో ఐదుగురి మృతి ఎండల తీవ్రత పెరగడంతో నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో వడదెబ్బకు గురై ఇద్దరు మ...

Athawale: పీవోకేను అప్పగించకుంటే.. మరిన్ని యుద్ధాలు తప్పవు - అఠవాలే

పీవోకేను భారత్‌లో విలీనం చేయకుంటే మనం మరిన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావాలే పేర్కొన్నారు. ఇం...

Wtc 2025: ఆ ముగ్గురు రీఎంట్రీ ఇస్తే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు.. ప్రత్యర్ధులకు ముచ్చెమటలే..

WTC 2023-25 ​​సైకిల్ యాషెస్‌ సిరీస్‌తో ప్రారంభమైంది. త్వరలో ఇండియా, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. తర్వాత వరుస సర...

Suryapet news | latest suryapet news - eenadu

అనిశాకు చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వీర రాఘవు...

Saradha scam: sudipta sen’s arrival in assam may open a pandora’s box

Bringing of Sudipta Sen, the prime accused in the multi-crore Saradha scam to Guwahati may open a Pandora’s Box in Assam...

Top